Breaking News

Ashes 4th Test: మొయిన్‌ అలీ డబుల్‌ ధమాకా

Published on Thu, 07/20/2023 - 18:49

ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ నాలుగో టెస్ట్‌ రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ డబుల్‌ ధమాకా సాధించాడు. ఈ సిరీస్‌కు ముందే రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని టెస్ట్‌ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇ‍చ్చిన మొయిన్‌.. టెస్ట్‌ల్లో 3000 పరుగులు, 200 వికెట్లు సాధించిన 16వ క్రికెటర్‌గా, నాలుగో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

కెరీర్‌లో 67వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న మొయిన్‌.. 3020 పరుగులు 201 టెస్ట్‌ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మొయిన్‌కు ముందు ఇయాన్‌ బోథమ్‌ (5200 పరుగులు, 383 వికెట్లు), ఆండ్రూ ఫ్లింటాఫ్‌ (3845, 226), స్టువర్ట్‌ బ్రాడ్‌ (3640, 600) ఈ ఘనత సాధించారు. 

ఇదిలా ఉంటే, 299/8 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 18 పరుగులు మాత్రమే జోడించి, మిగతా 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ అంటూ ధాటిగా ఆడుతుంది. ఆ జట్టు రెండో సెషన్‌ సమయానికి 23 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 108 పరుగులు చేసింది. డకెట్‌ (1) ఔట్‌ కాగా.. జాక్‌ క్రాలే (60), మొయిన్‌ అలీ (43) క్రీజ్‌లో ఉన్నారు. డకెట్‌ వికెట్‌ స్టార్క్‌కు దక్కింది.

అంతకుముందు, ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్‌ మార్ష్‌ (51), లబుషేన్‌ (51), హెడ్‌ (48), స్టీవ్‌ స్మిత్‌ (41), డేవిడ్‌ వార్నర్‌ (32), మిచెల్‌ స్టార్క్‌ (36 నాటౌట్‌). ఇంగ్లండ్‌ బౌలర్లలో వోక్స్‌ 5 వికెట్లతో చెలరేగగా.. బ్రాడ్‌ 2, ఆండర్సన్‌, వుడ్‌, మొయిన్‌ అలీ తలో వికెట్‌ పడగొట్టారు.

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)