Breaking News

చరిత్ర సృష్టించిన మిచెల్‌ స్టార్క్‌

Published on Thu, 12/04/2025 - 13:57

ఆసీస్‌ స్పీడ్‌ గన్‌ మిచెల్‌ స్టార్క్‌ (Mitchell Starc) చరిత్ర సృష్టించాడు. టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌గా పాకిస్తాన్‌ దిగ్గజం వసీం అక్రమ్‌ రికార్డును బద్దలు కొట్టాడు. యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్ట్‌ తొలి రోజు ఇది జరిగింది. హ్యారీ బ్రూక్‌ వికెట్‌ తీయడంతో స్టార్క్‌ ఖాతాలో ఈ రికార్డు వచ్చి చేరింది. వసీం అక్రమ్‌ 104 టెస్ట్‌ల్లో 414 వికెట్లు తీయగా.. స్టార్క్‌ 102వ టెస్ట్‌లోనే ఈ ఘనత సాధించాడు.

టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్లు (టాప్‌-5)
స్టార్క్‌-415*
వసీం అక్రమ్‌-414
చమింద వాస్‌-355
బౌల్ట్‌-317
జహీర్‌ ఖాన్‌-311

మ్యాచ్‌ విషయానికొస్తే.. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఇవాళే మొదలైన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. వారి ఈ సంతోషాన్ని స్టార్క్‌ ఎంతో సేపు మిగిల్చలేదు. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌, అదే స్కోర్‌ వద్ద (5) వన్‌ డౌన్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ను డకౌట్‌ చేశాడు. అనంతరం కొద్ది గ్యాప్‌ ఇచ్చి హ్యారీ బ్రూక్‌ను (31) పెవిలియన్‌కు పంపాడు.

42 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 182/4గా ఉంది. డకెట్‌, పోప్‌, క్రాలే, బ్రూక్‌ ఔట్‌ కాగా.. జో రూట్‌ (65), కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. స్టార్క్‌ 3 వికెట్లు తీయగా.. మైఖేల్‌ నెసర్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

స్టార్క్‌ నిప్పులు చెరగడంతో 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ ఆతర్వాత కుదురుకుంది. రూట్‌, క్రాలే అద్బుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి మూడో వికెట్‌కు 117 పరుగులు జోడించారు. క్రాలే 76 పరుగుల వద్ద ఉండగా నెసర్‌ అద్బుతమైన బంతితో క్రాలే వికెట్‌ తీశాడు. అనంతరం రూట్‌తో జత కలిసిన బ్రూక్‌ కాసేపు పోరాడాడు. నాలుగో వికెట్‌కు వీరిద్దరు 54 పరుగులు జోడించారు.

ఈ దశలో మరోసారి బంతినందుకున్న స్టార్క్‌ బ్రూక్‌ను బోల్తా కొట్టించి, ఇంగ్లండ్‌ను మరోసారి కష్టాల్లోకి నెట్టేశాడు. రూట్‌, స్టోక్స్‌ ఇంగ్లండ్‌ను గౌరవప్రదమైన స్కోర్‌ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.   
 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)