Breaking News

బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై బెన్‌ స్టోక్స్‌.. అలాంటి గెలుపు మాకొద్దు..!

Published on Mon, 07/03/2023 - 08:58

యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్ట్‌ ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్‌ వికెట్‌కీపర్‌/బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో స్టంపౌట్‌ అంశం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆసీస్‌ ఆటగాళ్లు క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించి బెయిర్‌స్టోను ఔట్‌ చేశారని కొందరంటుంటే.. రూల్స్‌ ప్రకారం అది కచ్చితంగా ఔటేనని మరికొందరు వాదిస్తున్నారు. మ్యాచ్‌ అనంతరం ఇదే అంశంపై ఇరు జట్ల కెప్టెన్లు కూడా స్పందించారు.

బెయిర్‌స్టో స్టంపౌట్‌ను ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ సమర్ధించుకుంటుంటే.. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ మాత్రం ఆసీస్‌ ఆటగాళ్ల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఓ పక్క రూల్స్‌ ప్రకారం బెయిర్‌స్టో ఔటేనని చెప్పుకొచ్చిన స్టోక్స్‌.. ఓ ఆటగాడిని ఆ పద్దతిలో ఔట్‌ చేసి వచ్చే గెలుపు తమకొద్దని వ్యాఖ్యానించాడు. ఒకవేళ కీలక సమయంలో ఓ ఆటగాడిని అలా ఔట్‌ చేసే అవకాశం తమకు వచ్చినా తాము వదిలేస్తామని, ఆ పద్ధతిలో గేమ్ గెలవడం తమకు ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. ఇలాంటి సందర్భంలో తాము అప్పీల్‌ చేసినా వెనక్కు తీసుకునే వాళ్లమని తెలిపాడు. ఆసీస్‌కు అది మ్యాచ్‌ విన్నింగ్‌ మూమెంట్‌ కాబట్టి అలా చేశారని అన్నాడు. 

కాగా, ఆఖరి రోజు ఆటలో బెయిర్‌స్టో ఔట్ కావడం మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. స్టోక్స్‌ వీరోచిత పోరాటం (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) చేసినా ఇంగ్లండ్‌ మ్యాచ్‌ గెలవలేకపోయింది. భారీ లక్ష్యఛేదనలో స్టోక్స్‌కు సహకరించే వారు లేకపోవడంతో ఇంగ్లండ్‌ ఓటమిపాలైంది. ఒకవేళ బెయిర్‌స్టో విషయంలో ఆసీస్‌ తమ అప్పీల్‌ను వెనక్కు తీసుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఏది ఏమైనప్పటికీ ఆసీస్‌ 43 పరుగుల తేడాతో గెలుపొంది, 5 మ్యాచ్‌ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)