Breaking News

ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. ఇంత మొండితనం పనికిరాదు!

Published on Wed, 07/26/2023 - 17:05

England Remain Unchanged For Fifth Ashes Test: యాషెస్‌ సిరీస్‌-2023లో ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్‌ తమ తుది జట్టును ప్రకటించింది. ఓవల్‌ వేదికగా జరుగనున్న మ్యాచ్‌లో మాంచెస్టర్‌లో ఆడిన జట్టునే కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. 

కాగా నాలుగో టెస్టులో విఫలమైన వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌పై విమర్శల నేపథ్యంలో.. ఆఖరి మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌ అతడికి అవకాశం ఇవ్వడం విశేషం. కాగా లీడ్స్‌లో జరిగిన మూడో టెస్టులో అండర్సన్‌ మిస్‌ అయ్యాడు. ఈ క్రమంలో మాంచెస్టర్‌లో అతడికి ఛాన్స్‌ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు.

వైఫల్యాలు కొనసాగిస్తూ
గత వైఫల్యాలను కొనసాగిస్తూ కేవలం ఒకే ఒక్క వికెట్‌ తీశాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు టెస్టుల్లో మొత్తంగా 114 ఓవర్లు వేసిన అండర్సన్‌ కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 1000 వికెట్ల(ఫస్ట్‌క్లాస్‌)తో లెజెండరీ బౌలర్‌గా పేరు తెచ్చుకున్న అతడు.. తాజా యాషెస్‌ సిరీస్‌లో మాత్రం జట్టుకు పెద్దగా ఉపయోగపడలేదు.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ వంటి వాళ్లు ఘాటు విమర్శలు చేశారు. దీంతో.. ఆఖరి టెస్టులో అండర్సన్‌ ఆడిస్తారా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ.. అతడిని కొనసాగిస్తున్నట్లు మేనేజ్‌మెంట్‌ స్పష్టం చేసింది. దీంతో ఇంత మొండితనం పనికిరాదంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

2-1తో ఆధిక్యంలో ఆస్ట్రేలియా
అండర్సన్‌కు బదులు ఓలీ రాబిన్సన్‌, జోస్‌ టంగ్‌లలో ఎవరో ఒకరికి ఛాన్స్‌ ఇస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కాగా జూలై 27 నుంచి ఇంగ్లండ్‌- ఆసీస్‌ మధ్య ఐదో టెస్టు ఆరంభం కానుంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్‌లో.. 2-1తో ఆధిక్యంలో ఉన్న కమిన్స్‌ బృందంపై ఇంగ్లండ్‌ పైచేయి సాధిస్తుందా లేదా వేచి చూడాలి!!

యాషెస్‌ 2023- ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్‌ తుది జట్టు:
బెన్ డకెట్, జాక్ క్రాలీ, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్.

చదవండి: 69 ఏళ్ల వయసులో ‘సూపర్‌స్టార్‌’ పెళ్లి! ఎవరీ బ్యూటీ? ఆమె పిల్లలు కూడా..

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)