Breaking News

యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలుచుకున్న సబలెంకా

Published on Sun, 09/07/2025 - 13:20

బెలారస్‌ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్‌ వన్‌ అరినా సబలెంకా వరుసగా రెండో ఏడాది యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఫైనల్లో ఆమె అమెరికాకు చెందిన అమండ అనిసిమోవాను వరుస సెట్లలో (6–3, 7–6(3)) ఓడించింది. 94 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సబలెంక 13 విన్నర్లు కొట్టి, 15 అన్‌ఫోర్స్డ్ ఎర్రర్లు మాత్రమే చేసింది. అనిసిమోవా 29 అన్‌ఫోర్స్డ్ ఎర్రర్లు, 7 డబుల్ ఫాల్ట్స్‌ చేసి తడబడింది.

ఈ మ్యాచ్‌లో సబలెంక తన శక్తివంతమైన సర్వ్‌లు, ఖచ్చితమైన గ్రౌండ్‌స్ట్రోక్‌లతో  అనిసిమోవాను కట్టడి చేసింది. రెండో సెట్ టైబ్రేక్‌కి వెళ్లినా, ఆమె మానసిక స్థైర్యాన్ని చూపించి విజయం సాధించింది.

సబలెంకకు ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. అన్ని టైటిళ్లను ఆమె హార్డ్‌కోర్ట్‌లపైనే సాధించింది. దీంతో ఆమెకు హార్డ్‌కోర్డ్‌ల రాణిగా గుర్తింపు వచ్చింది. సబలెంక 2023, 2024లో వరుసగా ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిళ్లు సాధించి.. 2024, 2025లో వరుసగా యూఎస్‌ ఓపెన్‌ను గెలిచింది. 

వరుసగా రెండు యూఎస్‌ ఓపెన్‌ టైటిళ్లు సాధించడంతో సబలెంక సెరీనా విలియమ్స్‌ సరసన చేరింది. సెరీనా కూడా గతంలో వరుసగా రెండు ఎడిషన్లలో యూఎస్‌ ఓపెన్‌ విజేతగా నిలిచింది.

టైటిల్‌ గెలిచిన అనంతరం సబలెంక మాట్లాడుతూ.. ఇది నా జీవితంలో మరచిపోలేని క్షణం. నా దేశానికి, అభిమానులకు ఈ విజయం అంకితమని తెలిపింది. 

తాజా విజయంతో సబలెంక 100 గ్రాండ్ స్లామ్ మ్యాచ్‌లు గెలిచిన రెండో మహిళగానూ గుర్తింపు పొందింది. సబలెంక ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ ఫైనల్‌కు చేరి కోకో గాఫ్‌ చేతిలో పరాజయంపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)