మరోసారి వార్తల్లోకెక్కిన అర్షదీప్‌ సింగ్‌

Published on Mon, 08/03/2026 - 18:13

టీమిండియా యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్ క్రికెటేతర విషయానికి సంబంధించి మరోసారి వార్తల్లో నిలిచాడు. అతడు పంజాబీ నటి, మోడల్‌ సమ్రీన్‌ కౌర్‌తో రిలేషన్‌లో ఉన్నాడని ఇటీవల సోషల్‌మీడియా కోడై కూసింది. ఆ ప్రచారం నిజమేనని తాజాగా జరిగిన ఓ ఉదంతంతో స్పష్టమైంది.

సమ్రీన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేయగా అర్షదీప్‌ స్పందించాడు. ఎలుగుబంటి, రెడ్‌ హార్ట్‌ ఎమోజీలతో కామెంట్‌ చేశాడు. దీనికి సమ్రీన్‌ కూడా రెడ్‌ హార్ట్‌, లాక్‌ ఎమోజీలతో రిప్లై ఇచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం బహిర్గతమైంది.

అర్ష్‌దీప్‌ కొద్ది రోజుల కిందట సమ్రీన్‌తో కలిసి ఉన్న రెండు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి 'My Person' అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఈ పోస్ట్ తర్వాతే అర్షదీప్‌-సమ్రీన్‌ రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం మొదలైంది.

ఈ ఏడాది ఐపీఎల్‌ సందర్భంగానూ వీరిద్దరు కలిసి తిరిగినప్పటికీ.. అప్పట్లో ఇంత ప్రచారం జరగలేదు. అర్షదీప్‌-సమ్రీన్‌ రిలేషన్‌కు నెటిజన్లు ఫిక్స్‌ అయిపోయినప్పటికీ.. వారి నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అర్షదీప్‌ క్రికెట్‌తో, సమ్రీన్‌ సోషల్‌మీడియాలో బిజీగా ఉన్నారు.

అర్షదీప్‌ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే వన్డేల్లో మాత్రం అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఒకే ఒక వన్డే ఆడి 0/72 గణాంకాలు నమోదు చేశాడు.

ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న దులీప్‌ ట్రోఫీ 2026 కోసం అర్ష్‌దీప్‌ సింగ్‌ నార్త్‌ జోన్‌ జట్టుకు ఎంపికయ్యాడు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన కన్హయ్య వాధ్వాన్‌ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఢిల్లీ ఆటగాడు ఆయుష్‌ బదోనీ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)