Breaking News

నీరజ్‌ ఆహ్వానానికి నదీమ్‌ నో

Published on Thu, 04/24/2025 - 03:10

లాహోర్‌: వచ్చే నెలలో బెంగళూరు వేదికగా జరగనున్న ‘నీరజ్‌ చోప్రా క్లాసిక్‌ జావెలిన్‌ ఈవెంట్‌’లో తాను పాల్గొనడం లేదని... పాకిస్తాన్‌కు చెందిన ఒలింపిక్‌ చాంపియన్‌ అర్షద్‌ నదీమ్‌ స్పష్టం చేశాడు. వచ్చే నెల 24న బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ఈ మీట్‌ జరగనుండగా... అందులో పాల్గొనాల్సిందిగా నదీమ్‌కు భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఆహ్వానించాడు. అయితే ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌నకు సిద్ధమవుతుండటంతో నీరజ్‌ ఆహ్వానాన్ని తిరిస్కరించినట్లు నదీమ్‌ బుధవారం వెల్లడించాడు. 

నీరజ్‌ నుంచి ఆహ్వా నం రావడం చాలా గొప్పగా ఉందని అయితే అనుకోకుండా తాను పాల్గొనలేకపోతున్నానని అన్నాడు. ‘నీరజ్‌ చోప్రా క్లాసిక్‌ ఈవెంట్‌ మే 24న జరగనుంది. ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించాలనే లక్ష్యంతో మెరుగైన సాధన కోసం నేను మే 22న కొరియా వెళ్తున్నా’ అని నదీమ్‌ వివరించాడు. మే 27 నుంచి 31 వరకు కొరియాలోని గుమీలో ఆసియా చాంపియన్‌షిప్‌ జరగనుంది. అంతకుముందు ఈ అంశంపై స్పందించిన నీరజ్‌ చోప్రా... ఈ టోర్నీలో పాల్గొనేందుకు నదీమ్‌కు ఆహ్వానం పంపినట్లు తెలిపాడు. 

2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో నదీమ్‌ జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం చేజిక్కించుకోగా... నీరజ్‌ 89.45 మీటర్లు విసిరి రజత పతకం కైవసం చేసుకున్నాడు. భారత్‌ వేదికగా నిర్వహిస్తున్న తొలి జావెలిన్‌ మెగా ఈవెంట్‌లో అంతర్జాతీయ స్టార్లు అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా), థామస్‌ రోలెర్‌ (జర్మనీ), జూలియస్‌ యెగో (కెన్యా), కర్టీస్‌ థాంప్సన్‌ (అమెరికా) పాల్గొంటున్నారు. 

ఈ టోర్నీకి ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య ‘ఎ’ కేటగిరీ గుర్తింపు ఇచ్చింది. షెడ్యూల్‌ ప్రకారం నీరజ్‌ చోప్రా క్లాసిక్‌ ఈవెంట్‌ పంచ్‌కులాలో జరగాల్సినా... నిర్ణీత ప్రమాణాలతో కూడిన ఫ్లడ్‌లైట్లు లేకపోవడంతో వేదికను బెంగళూరుకు మార్చారు. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు