Breaking News

ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్‌.. అర్ష‌ద్ న‌దీమ్‌కు భారీ నజరానా ప్రకటించిన పాక్‌

Published on Fri, 08/09/2024 - 08:47

ఒలింపిక్ గోల్డ్ మెడల్ కోసం 40 ఏళ్లగా ఎదురుచూస్తున్న పాకిస్తాన్ సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు  స్టార్ అథ్లెట్ అర్ష‌ద్ న‌దీమ్ తెర‌దించాడు. ప్యారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఈవెంట్‌లో బంగారు ప‌త‌కాన్ని సొంతం చేసుకున్న అర్ష‌ద్ న‌దీమ్‌.. విశ్వ‌వేదిక‌పై త‌న జాతీయ జెండాను రెపాల‌ప‌డించాడు.

 గురువారం జ‌రిగిన ఫైన‌ల్లో భార‌త స్టార్ జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ చోప్రాను వెన‌క్కి నెట్టి స్వ‌ర్ణ ప‌త‌కాన్ని ఈ పాకిస్తానీ కైవసం చేసుకున్నాడు. ఏకంగా జావెలిన్‌ను  92.97 మీటర్ల దూరం విసిరిన న‌దీమ్‌.. ప‌సిడి ప‌త‌కంతో పాటు అరుదైన ఒలింపిక్ రికార్డును కూడా త‌న పేరిట లిఖించుకున్నాడు.

ఇక అర్ష‌ద్ గోల్డ్‌మెడ‌ల్ సాధించ‌డంతో పాకిస్తాన్ మొత్తం సంబరాల్లో మునిగితేలిపోయింది. ఈ క్ర‌మంలోసిద్ధిఖీ గోల్డెన్ బాయ్ న‌దీమ్‌కు  కరాచీ మేయర్ ముర్తాజా వహాబ్  భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించారు. సింధ్ ప్రావిన్స్‌ తరపున రూ.5 కోట్లు(పాకిస్తానీ కరెన్సీ)ను నగదు బహుమతిగా ఇవ్వనున్నట్లు వహాబ్ సిద్ధిఖీ వెల్లడించారు. అదేవిధంగా ఒలింపిక్స్ చ‌రిత్ర‌లోనే  పాకిస్తాన్ త‌ర‌పున వ్య‌క్తిగ‌త విభాగంలో గోల్డ్‌మెడ‌ల్ గెలుచుకున్న తొలి అథ్లెట్ కూడా అర్ష‌ద్ కావడం విశేషం.
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)