Breaking News

మూడో రౌండ్లో అర్జున్‌ గెలుపు

Published on Sun, 08/10/2025 - 04:17

చెన్నై: తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ నిలకడైన ప్రదర్శనతో మూడో రౌండ్‌ గేమ్‌లో విజయం సాధించాడు. దీంతో చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీ ‘మాస్టర్స్‌’ కేటగిరీలో భారత ఆటగాడు రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శనివారం జరిగిన గేమ్‌లో అర్జున్‌... అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ రే రాబ్సన్‌ను కంగుతినిపించాడు. ఆరంభం నుంచే దీటైన పైఎత్తులు వేస్తూ వచి్చన అర్జున్‌ గెలిచేదాకా పట్టుదల కనబరిచాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పావులు కదిపాడు. ఇదే జోరుతో అర్జున్‌ 46 ఎత్తుల్లో ప్రత్యర్థిపై విజయం సాధించాడు. 

తొలిరౌండ్లో గెలిచిన తెలంగాణ ఆటగాడు రెండో రౌండ్‌ గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ప్రస్తుతం మూడు రౌండ్లు ముగిసేసరికి 2.5 పాయింట్లతో ఒక్కడే రెండో స్థానంలో ఉన్నాడు. ఆడిన మూడు రౌండ్లూ గెలిచిన జర్మనీ గ్రాండ్‌మాస్టర్‌ విన్సెంట్‌ కీమెర్‌ (3) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మూడో రౌండ్లో కీమర్‌... కార్తీకేయన్‌ మురళీపై గెలుపొందాడు. మిగతా భారత ఆటగాళ్లలో గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ గుజరాతి కీలకమైన విజయాన్ని సాధించాడు. 

సహచరుడు నిహాల్‌ శరిన్‌ (0.5)పై విదిత్‌ (1.5) గెలుపొందాడు. అతనికిది మొదటి విజయం కాగా... భారత యువ ఆటగాడు వి.ప్రణవ్‌ మూడో రౌండ్లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. టోర్నీ టాప్‌ సీడ్, గ్రాండ్‌మాస్టర్‌ అనీశ్‌ గిరి 
(నెదర్లాండ్స్‌)ను ఆద్యంతం నిలువరించాడు. దీంతో డచ్‌ ఆటగాడు డ్రా చేసుకోక తప్పలేదు. రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఇంకా ఆరు రౌండ్లు మిగిలున్నాయి.  

హారిక గేమ్‌ డ్రా 
ఇక్కడే జరుగుతున్న చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ ‘చాలెంజర్స్‌’ టోర్నీలో హైదరాబాద్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక వరుస పరాజయాలకు బ్రేక్‌ వేసింది. ఆధిబన్‌ భాస్కరన్‌తో జరిగిన మూడో రౌండ్‌ గేమ్‌ను హారిక డ్రా చేసుకుంది. ఆర్‌. వైశాలికి లియోన్‌ ల్యూక్‌ (భారత్‌) చేతిలో చుక్కెదురైంది. అభిమన్యు పురాణిక్‌... హర్షవర్ధన్‌పై, ప్రాణేశ్‌... ఇనియన్‌పై గెలుపొందారు. ఆర్యన్‌ చోప్రా, దీప్తాయన్‌ ఘోష్‌ల మధ్య జరిగిన గేమ్‌ డ్రాగా ముగిసింది

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)