Breaking News

మాస్టర్స్‌ కప్‌ చెస్‌ టోర్నీ విజేత అర్జున్‌

Published on Sat, 10/19/2024 - 03:33

లండన్‌: ఆద్యంతం అద్భుతంగా ఆడిన భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ డబ్ల్యూఆర్‌ చెస్‌ మాస్టర్స్‌ కప్‌ టోర్నీలో చాంపియన్‌గా అవతరించాడు. 16 మంది క్రీడాకారుల మధ్య నాకౌట్‌ పద్ధతిలో ఈ టోర్నీ జరిగింది. ఫైనల్లో అర్జున్‌ ‘అర్మగెడాన్‌’ గేమ్‌లో ఫ్రాన్స్‌ గ్రాండ్‌మాస్టర్‌ మాక్సిమి లాషెర్‌ లగ్రేవ్‌పై విజయం సాధించాడు. అంతకుముందు వీరిద్దరి మధ్య జరిగిన రెండు గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. 

తొలి గేమ్‌ 30 ఎత్తుల్లో... రెండో గేమ్‌ 38 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘అర్మగెడాన్‌’ గేమ్‌ను నిర్వహించారు. ఈ టోర్నీ నిబంధనల ప్రకారం అర్మగెడాన్‌ గేమ్‌లో తెల్లపావులతో ఆడే ప్లేయర్‌కు పది నిమిషాలు, నల్లపావులతో ఆడే ప్లేయర్‌కు ఆరు నిమిషాలు కేటాయిస్తారు. తెల్లపావులతో ఆడే ప్లేయర్‌ కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. నల్లపావులతో ఆడే ప్లేయర్‌ కనీసం ‘డ్రా’ చేసుకున్నా విజేతగా ప్రకటిస్తారు. 

అర్మగెడాన్‌ గేమ్‌లో లగ్రేవ్‌ తెల్లపావులతో, అర్జున్‌ నల్లపావులతో ఆడారు. అయితే అర్జున్‌ ఈ గేమ్‌ను ‘డ్రా’ చేసుకోకుండా 69 ఎత్తుల్లో లగ్రేవ్‌ను ఓడించడం విశేషం. సెమీఫైనల్లో అర్జున్‌ 1.5–0.5తో భారత్‌కే చెందిన ప్రజ్ఞానందపై, క్వార్టర్‌ ఫైనల్లో 1.5–0.5తో విదిత్‌ సంతోష్‌ గుజరాతిపై, గెలిచాడు. విజేతగా నిలిచిన అర్జున్‌కు 20 వేల యూరోలు (రూ. 18 లక్షల 25 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ టోర్నీలో ప్రదర్శన ద్వారా అర్జున్‌ ఎలో రేటింగ్‌ 2796 పాయింట్లకు చేరుకుంది.   
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)