Breaking News

సచిన్‌ తనయుడి సూపర్‌ పెర్ఫార్మెన్స్‌..!

Published on Tue, 09/17/2024 - 07:25

కేఎస్‌సీఏ ఇన్విటేషనల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో (కెప్టెన్‌ కే తిమ్మప్పయ్య మెమోరియల్‌) క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ అద్బుత ప్రదర్శనతో మెరిశాడు. ఈ టోర్నీలో గోవాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్‌.. ఆతిథ్య కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల ఘనత నమోదు చేశాడు. 

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అర్జున్‌.. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. అర్జున్‌ చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో గోవా ఇన్నింగ్స్‌ 189 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగులకు ఆలౌటైంది. అర్జున్‌ 13 ఓవర్లలో 41 పరుగులి​చ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. అనంతరం అభినవ్‌ తేజ్‌రాణా సెంచరీతో (109) కదంతొక్కడంతో గోవా తొలి ఇన్నింగ్స్‌లో 413 పరుగులు చేసింది. గోవా ఇన్నింగ్స్‌లో మంతన్‌ కుట్కర్‌ అర్ద సెంచరీతో (69) రాణించాడు. 

భారీ వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కర్ణాటక..సెకెండ్‌ ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కనబర్చింది. అర్జున్‌ 13.3 ఓవర్లలో 46 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడంతో కర్ణాటక సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 121 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా ఈ మ్యాచ్‌లో గోవా భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 

మ్యాచ్‌ మొత్తంలో అర్జున్‌ 26.3 ఓవర్లు వేసి 87 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. వచ్చే వారం 25వ పుట్టిన రోజు జరుపుకోబోతున్న అర్జున్‌.. సీనియర్‌ లెవెల్లో ఇప్పటివరకు 49 మ్యాచ్‌లు (మూడు ఫార్మాట్లలో) ఆడాడు. ఇందులో 68 వికెట్లు పడగొట్టాడు. లెఫ్ట్‌ అర్మ్‌ మీడియం పేసర్‌ అయిన అర్జున్‌ తన కెరీర్‌లో 13 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 21 వికెట్లు పడగొట్టాడు. 

చదవండి: బంగ్లాతో తొలి టెస్టు.. కోహ్లికి చుక్కలు చూపించిన బుమ్రా

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)