Breaking News

అర్జున్‌ టెండూల్కర్‌కు గుడ్‌ న్యూస్‌.. జట్టులో చోటిచ్చిన సెలక్టర్లు

Published on Tue, 10/14/2025 - 09:17

రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ కోసం గోవా క్రికెట్ అసోసియేషన్‌ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు చోటు దక్కింది. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ మైదానంలో అడుగు పెట్టేందుకు అర్జున్ సిద్దమయ్యాడు. అతడు చివరిసారిగా దేశీయ స్థాయిలో డిసెంబర్ 2024లో ఆడాడు.

ఆ తర్వాత ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో భాగమైనప్పటికి.. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అర్జున్ తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను గతేడాది నవంబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో ఆడాడు.

ముంబై టూ గోవా..
కాగా 2022-23 దేశవాళీ క్రికెట్ సీజన్‌కు ముందు ముంబై నుంచి గోవాకు తన మకాంను మార్చిన అర్జున్‌.. అప్పటి నుంచి మూడు ఫార్మాట్లలోనూ ఆ జట్టు తరపున ఆడుతున్నాడు. ఇప్పటివరకు 17 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 37 వికెట్లు, 532 పరుగులు సాధించాడు. తన రంజీ ట్రోఫీ కెరీర్ తొలి మ్యాచ్‌లోనే రాజస్థాన్‌పై అద్భుత శతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 

అర్జున్ లిస్ట్ ఎ క్రికెట్‌లో 25, టీ20ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) తరపున అతను ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. రాబోయో రంజీ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసి జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడాలని జూనియర్‌ టెండూల్కర్‌ భావిస్తున్నాడు.

గోవా 2025/26 సీజన్  ఎలైట్ గ్రూప్‌లో భాగంగా ఉంది. అక్టోబ‌ర్ 15న త‌మ‌ తొలి మ్యాచ్‌లో చండీగ‌ఢ్‌తో గోవా త‌ల‌ప‌డ‌నుంది. ఆ త‌ర్వాత‌ మ్యాచ్‌లలో కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, కేరళతో ఆడ‌నున్నాడు. ఈ టోర్నీలో గోవా క్రికెట్ జ‌ట్టుకు దీప్రాజ్ గావోంకర్ నాయకత్వం వహిస్తాడు. అదేవిదంగా కొత్త సీజ‌న్‌కు ముందు ఢిల్లీ నుంచి గోవాకు త‌న మకాంను మార్చుకున్న‌ స్టార్ ఆల్‌రౌండ‌ర్ లలిత్ యాద‌వ్‌కు కూడా ఈ జ‌ట్టులో చోటు ద‌క్కింది.

గోవా జట్టు: దీప్‌రాజ్‌ గాంకర్‌ (కెప్టెన్‌), లలిత్‌ యాదవ్‌ (వైస్‌ కెప్టెన్‌), సుయాష్‌ ప్రభుదేశాయ్‌, మంథన్‌ ఖుత్కర్‌, దర్శన్‌ మిషాల్‌, మోహిత్‌ రెడ్కర్‌, సమర్‌ దుబాషి, హేరంబ్‌ పరబ్‌, వికాస్‌ సింగ్‌, విషెస్‌ ప్రభుదేశాయ్‌, ఇషాన్‌క్‌ బఖార్‌, కశ్యాంత్‌ గడేకర్‌, రాజ్‌షేన్‌డ్‌ గడేకర్‌ అభినవ్ తేజ్రానా.
చదవండి: IND vs AUS: టీమిండియాతో తొలి వ‌న్డే.. ఆస్ట్రేలియాకు ఊహించ‌ని షాక్‌

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు