Breaking News

స‌చిన్ త‌న‌యుడికి భారీ షాక్‌.. జ‌ట్టు నుంచి తీసేశారు!

Published on Sat, 12/28/2024 - 17:02

భార‌త క్రికెట్ దిగ్గ‌జం త‌న‌యుడు అర్జున్ టెండూల్క‌ర్‌కు గోవా క్రికెట్ అసోసియేష‌న్ ఊహించ‌ని షాకిచ్చింది. విజయ్ హజారే ట్రోఫీ 2024-25 మ‌ధ్య‌లోనే గోవా జ‌ట్టు నుంచి అర్జున్ టెండూల్కర్‌ను జీసీఎ త‌ప్పించింది. దీంతో అత‌డు శ‌నివారం ఉత్త‌ర‌ఖాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌కు దూర‌మ‌మ‌య్యాడు.

25 ఏళ్ల అర్జున్‌ గోవా రెడ్ బాల్ జ‌ట్టులో రెగ్యూల‌ర్ స‌భ్యునిగా కొన‌సాగుతున్న‌ప్ప‌టికి వైట్ బాట్ స్వ్కాడ్‌లో మాత్రం త‌న స్ధానాన్ని సుస్థిరం చేసుకోలేక‌పోతున్నాడు. కాగా అంత‌కుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో కూడా కేవ‌లం మూడు మ్యాచ్‌లు ఆడిన త‌ర్వాత అత‌డిపై జీసీఎ వేటు వేసింది.

మ‌ళ్లీ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో స‌రిగ్గా మూడు మ్యాచ్‌లు ఆడిన త‌ర్వాతే సెల‌క్ట‌ర్లు జ‌ట్టు నుంచి త‌ప్పించారు. ఈ టోర్నీలో ఇప్ప‌టివ‌ర‌కు మూడు మ్యాచ్‌లు ఆడిన అర్జున్ కేవ‌లం 5 వికెట్లు మాత్ర‌మే ప‌డ‌గొట్టాడు. ఒడిశాతో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో అర్జున్ 3 వికెట్లు ప‌డ‌గొట్టిన‌ప్ప‌టికి.. త‌న 10 ఓవ‌ర్ల కోటాలో ఏకంగా 61 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు.

ఆత‌ర్వాతి రెండు మ్యాచ్‌ల్లో చెరో వికెట్ సాధించిన‌ప్ప‌ట‌కి ఆరుకు పైగా ఏకాన‌మీ రేటుతో ప‌రుగులు ఇచ్చాడు. ఈ క్ర‌మంలోనే అత‌డిపై  గోవా క్రికెట్ ఆసోసియేష‌న్ వేటు వేసింది. దీంతో వైట్‌బాల్ క్రికెట్‌లో అర్జున్ భ‌విత‌వ్యం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

మ‌రోసారి ముంబైతో..
కాగా అర్జున్ టెండూల్క‌ర్ ఐపీఎల్‌లో మరోసారి ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున ఆడ‌నున్నాడు. ఐపీఎల్‌-2025 మెగా వేలంలో రూ. 20 ల‌క్ష‌ల క‌నీస ధ‌ర‌కు అర్జున్‌ను ముంబై సొంతం చేసుకుంది. ఈ మెగా వేలంలో అర్జున్‌ను తొలుత ఏ ఫ్రాంచైజీ ప‌ట్టించుకోలేదు.

కానీ ఆఖ‌రికి యాక్సిలరేటెడ్ రౌండ్‌లో ముంబై ద‌క్కించుకుంది. జూనియ‌ర్ టెండూల్క‌ర్ ఐపీఎల్‌-2021 సీజ‌న్ నుంచి ముంబై ఇండియ‌న్స్ ఫ్రాంచైజీలో భాగంగా ఉన్నాడు. అతడు 5 మ్యాచ్‌లలో 9.37 ఎకానమీ రేటుతో 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అర్జున్ క‌నీసం ఈసారైనా రాణిస్తాడో లేదో వేచి చూడాలి.
చదవండి: IND Vs AUS: స్టుపిడ్‌.. స్టుపిడ్‌! భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లొద్దు: పంత్‌పై సన్నీ ఫైర్‌
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)