Breaking News

అర్జున్‌కు తొలి పరాజయం

Published on Mon, 08/11/2025 - 04:04

చెన్నై: క్వాంట్‌బాక్స్‌ చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీ మాస్టర్స్‌ కేటగిరీలో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌కు తొలి పరాజయం ఎదురైంది. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్‌ గేమ్‌లో అర్జున్‌ 70 ఎత్తుల్లో భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ నిహాల్‌ సరీన్‌ చేతిలో ఓడిపోయాడు. 

మరో గేమ్‌లో కార్తికేయన్‌ మురళీ (భారత్‌) 46 ఎత్తుల్లో జోర్డాన్‌ వాన్‌ ఫారీస్ట్‌ (నెదర్లాండ్స్‌)పై గెలుపొందాడు. రే రాబ్సన్‌ (అమెరికా) –అవండర్‌ లియాంగ్‌ (అమెరికా) గేమ్‌ 26 ఎత్తుల్లో ... విదిత్‌ (భారత్‌)–ప్రణవ్‌ (భారత్‌) గేమ్‌ 86 ఎత్తుల్లో... అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌)–విన్సెంట్‌ కీమెర్‌ (జర్మనీ) గేమ్‌ 28 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి.

ఇదే టోర్నమెంట్‌ చాలెంజర్స్‌ కేటగిరీలో భారత గ్రాండ్‌మాస్టర్, హైదరాబాద్‌ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక మూడో ఓటమిని చవిచూసింది. భారత్‌కే చెందిన లియోన్‌ ల్యూక్‌తో జరిగిన నాలుగో రౌండ్‌ గేమ్‌లో హారిక 59 ఎత్తుల్లో ఓడిపోయింది. 

ఆధిబన్‌ (భారత్‌)–ప్రాణేశ్‌ (భారత్‌) గేమ్‌ 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఇతర గేముల్లో దీప్తాయన్‌ ఘోష్‌ (భారత్‌) 76 ఎత్తుల్లో హర్షవర్ధన్‌ (భారత్‌)పై, ఇనియన్‌ (భారత్‌) 45 ఎత్తుల్లో ఆర్యన్‌ చోప్రా (భారత్‌)పై, అభిమన్యు పురాణిక్‌ (భారత్‌) 43 ఎత్తుల్లో వైశాలి (భారత్‌)పై విజయం సాధించారు.   

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)