ఒకే మ్యాచ్‌లో రెండు హ్యాట్రిక్‌లు.. 91 ఏళ్ల టోర్నీ చరిత్రలోనే

Published on Sun, 10/26/2025 - 08:38

రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో భాగంగా... అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో సర్వీసెస్‌ బౌలర్లు చరిత్ర సృష్టించారు. అర్జున్‌ శర్మ, మోహిత్‌ జాంగ్రా హ్యాట్రిక్‌లతో విజృంభించారు. సుదీర్ఘ చరిత్ర గల రంజీ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు బౌలర్లు హ్యాట్రిక్‌ నమోదు చేయడం ఇదే తొలిసారి. కాగా ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న అస్సాం... తొలి ఇన్నింగ్స్‌లో 17.2 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది.

ప్రద్యున్‌ సైకియా (42 బంతుల్లో 52; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), రియాన్‌ పరాగ్‌ (31 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. సర్వీసెస్‌ బౌలర్లలో అర్జున్‌ శర్మ హ్యాట్రిక్‌ సహా 5 వికెట్లు పడగొట్టగా... మోహిత్‌ జాంగ్రా 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.

అనంతరం సర్వీసెస్‌ 29.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. ఇర్ఫాన్‌ ఖాన్‌ (51) హాఫ్‌ సెంచరీ సాధించగా... అస్సాం బౌలర్లలో రియాన్‌ పరాగ్‌ 5 వికెట్లు, రాహుల్‌ సింగ్‌ 4 వికెట్లు తీశారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అస్సాం 21 ఓవర్లలో 5 వికెట్లకు 56 పరుగులు చేసింది. మొత్తంగా ఈ పోరులో తొలి రోజే 25 వికెట్లు నేలకూలాయి.
చదవండి: ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల‌కు సారీ చెప్పిన బీసీసీఐ..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)