Breaking News

ఆరో రౌండ్‌లో అరవింద్‌ చేతిలో అర్జున్‌ ఓటమి

Published on Mon, 11/11/2024 - 03:07

చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌కు తొలి ఓటమి ఎదురైంది. చెన్నైలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన ఆరో రౌండ్‌ గేమ్‌లో అర్జున్‌ 48 ఎత్తుల్లో భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ అరవింద్‌ చిదంబరం చేతిలో అనూహ్యంగా ఓడిపోయాడు. 

అరవింద్‌ చేతిలో ఓటమితో అర్జున్‌ లైవ్‌ ర్యాంకింగ్స్‌లో 2801.8 పాయింట్లతో ప్రపంచ రెండో ర్యాంక్‌ నుంచి నాలుగో ర్యాంక్‌కు పడిపోవడం గమనార్హం. అమీన్‌–పర్హామ్‌ (ఇరాన్‌) మధ్య గేమ్‌ 37 ఎత్తుల్లో...మాక్సిమి వాచిర్‌ లాగ్రెవ్‌ (ఫ్రాన్స్‌)–అలెక్సీ సరానా (సెర్బియా) మధ్య గేమ్‌ 31 ఎత్తుల్లో... అరోనియన్‌ (అమెరికా)–విదిత్‌ (భారత్‌) మధ్య గేమ్‌ 64 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. 

ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. ఆరో రౌండ్‌ తర్వాత అర్జున్, అరోనియన్‌ 4 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలోఉన్నారు. అరవింద్, అమీన్‌ 3.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. ఈరోజు జరిగే చివరిదైన ఏడో రౌండ్‌ గేముల్లో లాగ్రెవ్‌తో అర్జున్‌; అరోనియన్‌తో అమీన్‌; విదిత్‌తో అలెక్సీ; పర్హామ్‌తో అరవింద్‌ తలపడతారు.    

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)