Breaking News

సెమీస్‌లో అర్జున్‌ ఓటమి

Published on Sun, 07/20/2025 - 04:04

లాస్‌ వేగస్‌: భారత చెస్‌ స్టార్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌... ఫ్రీస్టయిల్‌ గ్రాండ్‌స్లామ్‌ టూర్‌ చెస్‌ టోర్నమెంట్‌ సెమీ ఫైనల్లో ఓటమి పాలయ్యాడు. అప్రతిహత విజయాలతో దూసుకొచ్చిన అర్జున్‌... సెమీస్‌లో 0–2 పాయింట్ల తేడాతో లెవాన్‌ అరోనియన్‌ (అమెరికా) చేతిలో ఓడాడు. ఫ్రీస్టయిల్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో సెమీస్‌కు చేరిన తొలి భారత చెస్‌ ప్లేయర్‌గా నిలిచిన అర్జున్‌ కీలక పోరులో ఆకట్టుకోలేకపోయాడు. 

తొలి గేమ్‌లో అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్న అర్జున్‌... రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ పోటీలో నిలిచేందుకు రిస్క్‌ తీసుకొని పరాజయం పాలయ్యాడు. మరో సెమీస్‌లో హాన్స్‌ నీమన్‌ (అమెరికా) 2.5–1.5తో ఫాబియానో కరువానా (అమెరికా)పై విజయం సాధించి ఫైనల్‌కు చేరాడు. తుదిపోరులో నీమన్‌తో అరోనియన్‌ తలపడనున్నాడు. 

‘వైట్‌ గ్రూప్‌’ లీగ్‌ దశలో నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించి ‘టాపర్‌’గా నిలిచి ఆ తర్వాత క్వార్టర్‌ ఫైనల్లో పరాజయం పాలైన భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద వర్గీకరణ మ్యాచ్‌లో 1.5–0.5తో విన్సెంట్‌ కీమెర్‌ (జర్మనీ)పై గెలుపొందాడు. ఇతర క్లాసిఫికేషన్‌ మ్యాచ్‌ల్లో కార్ల్‌సన్‌ 1.5–0.5తో జవోఖిర్‌ సిందరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై, హికారు నకముర (అమెరికా) 2–0తో లెనియర్‌ డొమింగెజ్‌ పెరెజ్‌ (అమెరికా)పై, వెస్లీ సో (అమెరికా) 3–1తో నొదిర్‌బెక్‌ అబ్దుసత్తరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై విజయాలు సాధించారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)