Breaking News

అర్జున్‌కు మూడో స్థానం

Published on Sat, 08/16/2025 - 04:03

చెన్నై: చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్, భారత గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌), అర్జున్, కార్తికేయన్‌ మురళీ (భారత్‌) 5 పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. దాంతో అనీశ్‌కు రెండో స్థానం, అర్జున్‌కు మూడో స్థానం, కార్తికేయన్‌కు నాలుగో స్థానం ఖరారయ్యాయి. 7 పాయింట్లతో జర్మనీ గ్రాండ్‌మాస్టర్‌ విన్సెంట్‌ కీమెర్‌ చాంపియన్‌గా నిలిచాడు. 

భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు నిహాల్‌ సరీన్‌ 4.5 పాయింట్లతో ఐదో స్థానంలో, విదిత్‌ 4 పాయింట్లతో ఏడో స్థానంలో, ప్రణవ్‌ 3 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచారు. మొత్తం పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీని నిర్వహించారు. శుక్రవారం జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్‌ గేముల్లో కీమెర్‌ 41 ఎత్తుల్లో రే రాబ్సన్‌ (అమెరికా)పై, అనీశ్‌ గిరి 33 ఎత్తుల్లో జోర్డెన్‌ (నెదర్లాండ్స్‌)పై గెలిచారు. 

అర్జున్‌–కార్తికేయన్‌ గేమ్‌ 49 ఎత్తుల్లో... విదిత్‌ (భారత్‌)–లియాంగ్‌ (అమెరికా) గేమ్‌ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. విజేత కీమెర్‌కు రూ. 25 లక్షలు... అనీశ్‌కు రూ. 15 లక్షలు... అర్జున్‌కు రూ. 10 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.  ఇదే వేదికపై జరిగిన చాలెంజర్స్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రాణేశ్‌ 6.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. తద్వారా వచ్చే ఏడాది చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ టోర్నీకి అర్హత సాధించాడు. హైదరాబాద్‌ ప్లేయర్‌ హారిక 1.5 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది.  

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)