Breaking News

‘టైబ్రేక్‌’కు అర్జున్, హరికృష్ణ

Published on Thu, 11/13/2025 - 04:03

పనాజీ: సొంతగడ్డపై జరుగుతున్న పురుషుల ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత్‌ నుంచి ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, పెంటేల హరికృష్ణ, ప్రజ్ఞానంద బరిలో మిగిలారు. ఈ ముగ్గురు తదుపరి దశకు అర్హత సాధిస్తారో లేదో నేడు టైబ్రేక్‌ రౌండ్‌ తర్వాత తేలుతుంది. క్లాసికల్‌ ఫార్మాట్‌లో నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత అర్జున్‌–పీటర్‌ లెకో (హంగేరి); హరికృష్ణ–నిల్స్‌ గ్రాండెలియస్‌ (స్వీడన్‌); ప్రజ్ఞానంద–డానిల్‌ దుబోవ్‌ (రష్యా) 1–1తో సమంగా నిలిచారు.  దాంతో విజేతలను నిర్ణయించేందుకు నేడు ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో టైబ్రేక్‌ గేమ్‌లను నిర్వహిస్తారు. 

అర్జున్‌–పీటర్‌ లెకో రెండో గేమ్‌ 36 ఎత్తుల్లో... హరికృష్ణ–గ్రాండెలియస్‌ రెండో గేమ్‌ 38 ఎత్తుల్లో... ప్రజ్ఞానంద–దుబోవ్‌ రెండో గేమ్‌ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. మరోవైపు మరో ఇద్దరు భారత గ్రాండ్‌మాస్టర్లు కార్తీక్‌ వెంకటరామన్, ప్రణవ్‌ నాలుగో రౌండ్‌ను దాటలేకపోయారు. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండుసార్లు జాతీయ చాంపియన్‌ కార్తీక్‌ 0.5–1.5తో లె క్వాంగ్‌ లియెమ్‌ (వియత్నాం) చేతిలో... ప్రణవ్‌ 0.5–1.5తో నొదిర్‌బెక్‌ యాకు»ొయెవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓటమి చవిచూశారు. రెండో గేమ్‌లో కార్తీక్‌ 68 ఎత్తుల్లో... ప్రణవ్‌ 38 ఎత్తుల్లో ఓడిపోయారు.           

నొదిర్‌బెక్‌ యాకుబొయెవ్, లె క్వాంగ్‌ లియెమ్‌లతోపాటు లెవోన్‌ అరోనియన్‌ (అమెరికా), అల్కంటారా మార్టినెజ్‌ (మెక్సికో), అలెగ్జాండర్‌ డాన్‌షేoకో (జర్మనీ) కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. నాలుగో రౌండ్‌లో అరోనియన్‌ 1.5–0.5తో రాడోస్లా (పోలాండ్‌)పై, అల్కంటారా 1.5–0.5తో సరానా అలెక్సీ (సెర్బియా)పై, డాన్‌షేoకో 1.5–0.5తో బ్లూబామ్‌ మథియాస్‌ (జర్మనీ)పై విజయం సాధించారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)