Breaking News

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అర్జున్, హరికృష్ణ

Published on Fri, 11/14/2025 - 03:51

పనాజీ: తాడో పేడో తేల్చుకోవాల్సిన టైబ్రేక్‌ గేముల్లో భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌... ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ మెరిశారు. తద్వారా సొంతగడ్డపై జరుగుతున్న పురుషుల ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌లో అర్జున్, హరికృష్ణ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. 

గురువారం జరిగిన నాలుగో రౌండ్‌ టైబ్రేక్‌లో ప్రపంచ 6వ ర్యాంకర్, 22 ఏళ్ల అర్జున్‌ 2–0తో ప్రపంచ 55వ ర్యాంకర్, 46 ఏళ్ల పీటర్‌ లెకో (హంగేరి)పై... ప్రపంచ 46వ ర్యాంకర్‌ హరికృష్ణ 1.5–0.5తో ప్రపంచ 52వ ర్యాంకర్‌ నిల్స్‌ గ్రాండెలియస్‌ (స్వీడన్‌)పై గెలుపొందారు. 

పీటర్‌ లెకోతో జరిగిన తొలి టైబ్రేక్‌ గేమ్‌లో అర్జున్‌ 40 ఎత్తుల్లో... రెండో టైబ్రేక్‌ గేమ్‌లో 57 ఎత్తుల్లో నెగ్గాడు. గ్రాండెలియస్‌తో జరిగిన తొలి టైబ్రేక్‌ గేమ్‌ను 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ... రెండో టైబ్రేక్‌ గేమ్‌లో 34 ఎత్తుల్లో విజయం సాధించాడు.   

ప్రజ్ఞానందకు నిరాశ 
భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానందకు నిరాశ ఎదురైంది. తమిళనాడుకు చెందిన ప్రపంచ 7వ ర్యాంకర్‌ ప్రజ్ఞానంద ప్రిక్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగాడు. ప్రపంచ 45వ ర్యాంకర్‌ డానిల్‌ డుబోవ్‌ (రష్యా)తో జరిగిన టైబ్రేక్‌లో ప్రజ్ఞానంద 0.5–1.5తో ఓడిపోయాడు. 

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)