సెమీస్‌లో అర్జున్‌

Published on Sat, 07/19/2025 - 04:17

లాస్‌ వేగస్‌: ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పకడ్బందీ ఎత్తులతో అలరించిన భారత స్టార్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌... ఫ్రీస్టయిల్‌ గ్రాండ్‌స్లామ్‌ టూర్‌ చెస్‌ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఉజ్బెకిస్తాన్‌ గ్రాండ్‌మాస్టర్‌ నొదిర్‌బెక్‌ అబ్దుసత్తారోవ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో అర్జున్‌ 1.5–0.5తో గెలుపొందాడు. నల్ల పావులతో ఆడిన తొలి గేమ్‌ను అర్జున్‌ 64 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. అనంతరం తెల్ల పావులతో ఆడిన రెండో గేమ్‌లో అర్జున్‌ 69 ఎత్తుల్లో గెలుపొంది సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. 

సెమీఫైనల్లో లెవాన్‌ అరోనియన్‌ (అమెరికా)తో అర్జున్‌ తలపడతాడు. ‘వైట్‌ గ్రూప్‌’ లీగ్‌ దశలో నార్వే దిగ్గజం, ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించి ‘టాపర్‌’గా నిలిచిన ప్రజ్ఞానందకు క్వార్టర్‌ ఫైనల్లోనే ఓటమి ఎదురైంది. ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ప్రజ్ఞానంద 3–4 పాయింట్ల తేడాతో పోరాడి ఓడిపోయాడు. తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద 29 ఎత్తుల్లో నెగ్గగా... రెండో గేమ్‌లో కరువానా 60 ఎత్తుల్లో గెలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. 

ఆ తర్వాత మూడో గేమ్‌లో ప్రజ్ఞానంద 58 ఎత్తుల్లో... నాలుగో గేమ్‌లో కరువానా 34 ఎత్తుల్లో నెగ్గారు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. ఐదో గేమ్‌లో కరువానా 64 ఎత్తుల్లో నెగ్గి 3–2తో ఆధిక్యంలోకి వెళ్లగా... ఆరో గేమ్‌లో ప్రజ్ఞానంద 48 ఎత్తుల్లో గెలిచి స్కోరును 3–3తో సమం చేశాడు. నిర్ణాయక ఏడో గేమ్‌లో కరువానా 72 ఎత్తుల్లో గెలిచి సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. సెమీఫైనల్లో అమెరికాకే చెందిన హాన్స్‌ నీమన్‌తో కరువానా తలపడతాడు. ఇతర క్వార్టర్‌ ఫైనల్స్‌లో అరోనియన్‌ 2.5–1.5తో హికారు నకముర (అమెరికా)పై, హాన్స్‌ నీమన్‌ 4–2తో సిందరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై గెలుపొందారు.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)