Breaking News

ఇంగ్లండ్ క్రికెటర్‌కు​ వీసా సమస్య.. ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిపివేత!?

Published on Tue, 02/13/2024 - 09:16

భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టును వీసా సమస్య వెంటాడుతోంది. తాజాగా మరో ఇంగ్లీష్‌ ఆటగాడికి వీసా సమస్య ఎదురైంది. ఇంగ్లండ్‌ జట్టు స్వల్ప విరామం తర్వాత మూడో టెస్టు కోసం దుబాయ్‌ నుంచి రాజ్‌కోట్‌కు సోమవారం చేరుకుంది. ఈ క్రమంలో సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ఆ జట్టు ఆ యువ స్పిన్నర్‌ రెహాన్ అహ్మద్‌ను రాజ్‌కోట్ హిస్సోర్‌ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు.

స్పోర్ట్‌స్టార్‌ రిపోర్ట్‌ ప్రకారం.. అహ్మద్‌ కేవలం సింగిల్-ఎంట్రీ వీసాను మాత్రమే కలిగి ఉన్నందున విమానాశ్రయంలో అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అయితే మూడో టెస్టుకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నందున అత్యవసర పరిస్థితి కింద స్ధానిక అధికారులు 2 రోజుల వీసాను రెహాన్‌కు మంజూరు చేసినట్లు సమాచారం.

అదే విధంగా మరో రెండు రోజుల్లో వీసా సమస్యను పూర్తిగా పరిష్కరించాలని ఇంగ్లండ్‌ మేనెజ్‌మెంట్‌ అధికారులు సూచించినట్లు స్పోర్ట్‌స్టార్‌ తమ నివేదికలో పేర్కొంద. అయితే దుబాయ్‌ నుంచి వచ్చిన ఇంగ్లండ్‌ జట్టులో రెహాన్‌ ఒక్కడే ఈ సమస్యను ఎదుర్కొన్నాడు.

మిగితా జట్టు సభ్యులందరూ తాము బసే చేసే హోటల్‌కు చేరుకున్నారు. రెహాన్‌ కాస్త ఆలస్యంగా జట్టుతో చేరాడు. కాగా అంతకుమం‍దు మరో యువ స్పిన్నర్‌ షోయబ్ బషీర్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. వీసా జారీలో జాప్యం కారణంగా జట్టుతో పాటు సకాలంలో భారత్ చేరుకోలేకపోయాడు.
చదవండి: IND vs ENG: సెంచరీల మోత మోగించాడు.. టీమిండియాలో చోటు కొట్టేశాడు! 3 ఏళ్ల తర్వాత

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)