Breaking News

అమెరికా అండర్‌–19 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ అనిక రెడ్డి

Published on Mon, 12/23/2024 - 02:57

బ్రూమ్‌ఫీల్డ్‌ (కొలరాడో): వచ్చే ఏడాది జనవరిలో మలేసియా వేదికగా జరిగే మహిళల అండర్‌–19 ప్రపంచకప్‌ టి20 క్రికెట్‌ టోర్నీలో పాల్గొనే అమెరికా జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన అమెరికా జట్టుకు భారత సంతతికి చెందిన తెలుగమ్మాయి కొలన్‌ అనిక రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. 

తెలుగు సంతతికి చెందిన పగిడ్యాల చేతన రెడ్డి, ఇమ్మడి శాన్వి, సషా వల్లభనేని కూడా అమెరికా జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మలేసియాలోని నాలుగు వేదికల్లో ఈ మెగా ఈవెంట్‌ జరుగుతుంది. మొత్తం 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. 

డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్, వెస్టిండీస్, శ్రీలంక, మలేసియా జట్లకు గ్రూప్‌ ‘ఎ’లో చోటు కల్పించారు. గ్రూప్‌ ‘బి’లో అమెరికా, ఇంగ్లండ్, పాకిస్తాన్, ఐర్లాండ్‌... గ్రూప్‌ ‘సి’లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నైజీరియా, సమోవా... గ్రూప్‌ ‘డి’లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నేపాల్, స్కాట్లాండ్‌ జట్లున్నాయి.  

అమెరికా అండర్‌–19 జట్టు: కొలన్‌ అనిక రెడ్డి (కెప్టెన్‌), అదితిబా చుదసమ (వైస్‌ కెప్టెన్‌), పగిడ్యాల చేతన రెడ్డి, చేతన ప్రసాద్, దిశ ఢింగ్రా, ఇసాని మహేశ్‌ వాఘేలా, లేఖ హనుమంత్‌ శెట్టి, మాహి మాధవన్, నిఖర్‌ పింకూ దోషి, పూజా గణేశ్, పూజా షా, రీతూప్రియా సింగ్, ఇమ్మడి శాన్వి, సషా వల్లభనేని, సుహాని థదాని.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)