Breaking News

దుమ్ములేపుతున్న శ్రీలంక.. వరుసగా మూడో సిరీస్‌ విజయం

Published on Tue, 02/20/2024 - 07:17

దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 72 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్‌ మిగిలూండగానే సిరీస్‌ను 2-0 తేడాతో శ్రీలంక కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.  శ్రీలంక బ్యాటర్లలో సమరవిక్రమ(51) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మాథ్యూస్‌(22 బంతుల్లో 42, 2ఫోర్లు, 4సిక్స్‌లు), హసరంగా(9 బంతుల్లో 22) మెరుపులు మెరిపించారు.

అఫ్గాన్‌ బౌలర్లలో నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ఫరూఖీ, నవీన్‌ తలా వికెట్‌ పడగొట్టారు. అనంతరం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌.. లంక బౌలర్ల దాటికి 17 ఓవర్లలో కేవలం 115 పరుగులకే కుప్పకూలింది.

లంక బౌలర్లలో మాథ్యూస్‌, బినార ఫెర్నాండో, హసరంగా,థీక్షణ, పతిరానా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌లో కరీం జనత్‌(28) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 దంబుల్లా వేదికగా బుధవారం జరగనుంది. కాగా లంక ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)