Breaking News

ఏంటి అన్న నీ​కే ఎందుకు ఇలా.. ఫోర్‌ కొట్టి అదే బంతికి ఔటయ్యాడు!

Published on Sun, 02/04/2024 - 07:42

కొలంబో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో శ్రీలంక పట్టుబిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. లంక ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగుల ఆధిక్యంలో ఉంది.

అయితే ఈ మ్యాచ్‌లో శ్రీలంక  వెటరన్‌ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ చేసిన మాథ్యూస్‌(141)ఊహించని విధంగా ఔటయ్యాడు. హిట్‌వికెట్‌గా మథ్యూస్‌ వెనుదిరిగాడు.

ఏం జరిగిందంటే?
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 102 ఓవర్‌లో స్పిన్నర్‌ కైస్ అహ్మద్ రెండో బంతిని మథ్యూస్‌కు లెగ్‌ సైడ్‌ బాగా వైడ్‌ వేశాడు. అయితే షాట్‌ ఆఫర్ ఉండడంతో మథ్యూస్‌ కూడా కొంచెం లెగ్‌ సైడ్‌ జరిగి స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతిని సరిగ్గా కనక్ట్‌ చేసిన మథ్యూస్ ఆ డెలివరినీ ఫోర్‌గా మలిచాడు.

కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్‌ చోటు చేసుకుంది. బంతిని బౌండరీకి తరిలించే క్రమంలో మథ్యూస్ సమన్వయం కోల్పోయి తన బ్యాట్‌తో స్టంప్స్‌ను పడగొట్టాడు.  దీని ఫలితంగా మాథ్యూస్‌ హిట్‌ వికెట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఏంటి బ్రో నీ​కే ఎందుకు ఇలా జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు.

కాగా గతేడాది భారత్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో కూడా మథ్యూస్‌ టైమ్డ్‌ ఔట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అప్పటిలో అది వరల్డ్‌ క్రికెట్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది.
చదవండి: #Jasprit Bumrah: వారెవ్వా బుమ్రా.. క్రికెట్‌ చరిత్రలోనే సూపర్‌ బాల్‌! బ్యాటర్‌ మైండ్‌ బ్లాంక్‌

Videos

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

Photos

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)