Breaking News

చరిత్ర సృష్టించిన ఆండ్రూ టై .. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా!

Published on Sat, 02/04/2023 - 19:44

టీ20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా పేసర్‌ ఆండ్రూ టై ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా టై రికార్డులకెక్కాడు. బిగ్‌బాష్‌ లీగ్‌లో పెర్త్ స్కార్చెర్స్‌కు ఆడుతున్న టై.. ఫైన‌ల్లో బ్రిస్బేన్ హీట్‌పై జేమ్స్‌ బేజ్లే  ఔట్ చేసి ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక అరుదైన రికార్డును అతడు కేవలం 211 మ్యాచ్‌ల్లోనే సాధించాడు.

అంతకుముందు ఈ రికార్డు ఆఫ్గానిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ ర‌షీద్ ఖాన్ పేరిట ఉండేది. రషీద్‌ తన టీ20 కెరీర్‌లో  213 మ్యాచుల్లో 300 వికెట్లు ప‌డ‌గొట్టాడు. తాజామ్యాచ్‌తో రషీద్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో​ మూడో స్థానంలో శ్రీలంక దిగ్గజం  ల‌సిత్ మ‌లింగ ఉన్నాడు.  మలింగ 222 మ్యాచుల్లో 300 వికెట్లు సాధించాడు.

ఐదో సారి ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చెర్స్‌
బిగ్‌బాష్‌ లీగ్‌-2023 ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చెర్స్‌ నిలిచింది. పెర్త్‌ వేదికగా జరిగిన ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన స్కార్చర్స్.. ఐదో సారి టైటిల్‌ను ఎగిరేసుకుపోయింది.  176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. పెర్త్‌ టైటిల్‌ సాధించడంలో ఆ జట్టు కెప్టెన్‌ అష్టన్ టర్నర్ కీలక పాత్ర పోషించాడు.

32 బంతులు ఎదుర్కొన్న టర్నర్‌ 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేశాడు. అదే విధంగా ఆఖరిలో నిక్ హాబ్సన్(7 బంతుల్లో 18 నాటౌట్‌), కూపర్ కొన్నోలీ(11 బంతుల్లో 25 నాటౌట్‌) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడారు.


చదవండి: W T20 WC 2023: మహిళల పోరుకు సర్వం సిద్దం.. తొలి మ్యాచ్‌లోనే పాక్‌తో భారత్‌ ఢీ

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)