Breaking News

రిటైర్మెంట్‌ ప్రకటించిన టీ20 యోధుడు

Published on Thu, 07/17/2025 - 07:05

టీ20 యోధుడు, వెస్టిండీస్‌ పొట్టి క్రికెట్‌ దిగ్గజం ఆండ్రీ రసెల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో త్వరలో జరుగబోయే టీ20 సిరీస్‌ తనకు చివరిదని వెల్లడించాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోనూ రసెల్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. జులై 20, 22 తేదీల్లో ఈ రెండు మ్యాచ్‌లు రసెల్‌ స్వస్థలమైన జమైకాలో జరుగనున్నాయి.

37 ఏళ్ల రసెల్‌ వెస్టిండీస్‌ తరఫున 2010లో అరంగేట్రం చేసి 84 టీ20లు ఆడాడు. ఇందులో 163.1 స్ట్రయిక్‌రేట్‌తో 3 అర్ద సెంచరీల సాయంతో 1078 పరుగులు చేశాడు. బౌలర్‌గా 61 వికెట్లు తీశాడు. రసెల్‌ విండీస్‌ గెలిచిన రెండు టీ20 వరల్డ్‌కప్‌ల్లో (2012, 2016) కీలక సభ్యుడిగా ఉన్నాడు.  

పొట్టి క్రికెట్‌లో ఘన చరిత్ర కలిగిన రసెల్‌.. ఈ ఫార్మాట్‌లో 561 మ్యాచ్‌లు ఆడి 168.31 స్ట్రయిక్‌రేట్‌తో 2 సెంచరీలు, 33 అర్ద సెంచరీల సాయంతో 9316 పరుగులు సాధించాడు. అలాగే బౌలింగ్‌లో 485 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినా రసెల్‌ ఫ్రాంచైజీ క్రికెట్‌లో కొనసాగుతాడు.

దెబ్బ మీద దెబ్బ
టెస్ట్‌ క్రికెట్‌లో, వన్డేల్లో ప్రభ కోల్పోయి అదఃపాతాళానికి పడిపోయిన వెస్టిండీస్‌.. టీ20 ఫార్మాట్‌లో మాత్రం ఆడపాదడపా మెరుపులు మెరిస్తూ ఉంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో విండీస్‌ ఈ ఫార్మాట్‌లోనూ కిందికి పడిపోయే అవకాశం ఉంది. ఇటీవలే ఆ జట్టు టీ20 స్పెషలిస్ట్‌ నికోలస్‌ పూరన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. తాజాగా రసెల్‌ కూడా అదే బాటలో నడవడంతో టీ20ల్లో విండీస్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  

15 మంది సభ్యుల్లో ఒకరు
రసెల్‌ త్వరలో ఆస్ట్రేలియాతో ప్రారంభం కాబోయే టీ20 సిరీస్‌ కోసం ఎంపిక చేయబడ్డాడు. ఈ సిరీస్‌ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల్లో రసెల్‌ ఒకరు. ఈ సిరీస్‌ జులై 20, 22, 25, 26, 28 తేదీల్లో జమైకా (తొలి రెండు మ్యాచ్‌లు), సెయింట్‌ కిట్స్‌ (ఆఖరి మూడు మ్యాచ్‌లు) వేదికలుగా జరుగనుంది. 

ఈ సిరీస్‌లో విండీస్‌ జట్టుకు షాయ్‌ హోప్‌ నాయకత్వం వహిస్తాడు. ఈ జట్టులో హెట్మైర్‌, హోల్డర్‌, బ్రాండన్‌ కింగ్‌, ఎవిన్‌ లూయిస్‌, రోవ్‌మన్‌ పావెల్‌, రూథర్‌ఫోర్డ్‌, రొమారియో షెపర్డ్‌ లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు.

ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్‌), జువెల్ ఆండ్రూ, జెడియా బ్లేడ్స్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మైర్, జాసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జరి జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటీ, రోవ్‌మన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)