Breaking News

ఆంధ్ర గెలిచినా...

Published on Wed, 12/17/2025 - 03:14

పుణే: దేశవాళీ టి20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీని ఆంధ్ర జట్టు ‘సూపర్‌ లీగ్‌’ దశతోనే ముగించింది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా... మంగళవారం జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు విజయం సాధించినా... రన్‌రేట్‌లో వెనుకబడ్డ కారణంగా ఫైనల్‌ చేరే అవకాశం కోల్పోయింది. ‘సూపర్‌ లీగ్‌’లో మూడు మ్యాచ్‌లు ఆడిన ఆంధ్ర జట్టు 2 విజయాలు, ఒక పరాజయంతో 8 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 

జార్ఖండ్‌ కూడా ఎనిమిది పాయింట్లతోనే ఉన్నా... రన్‌రేట్‌లో మెరుగ్గా ఉన్న జార్ఖండ్‌ ముందంజ వేయగా... ఆంధ్ర జట్టు ఇంటిబాట పట్టింది. టీమిండియా ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి (22 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు; 2/32) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 9 పరుగుల తేడాతో జార్ఖండ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నితీశ్‌ రెడ్డి టాప్‌ స్కోరర్‌ కాగా... శ్రీకర్‌ భరత్‌ (35; 4 ఫోర్లు, 1 సిక్స్‌), అశి్వన్‌ హెబ్బర్‌ (30; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం జార్ఖండ్‌ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. విరాట్‌ సింగ్‌ (40 బంతుల్లో 77; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీ సాధించగా... కెప్టెన్ ఇషాన్‌ కిషన్‌ (18 బంతుల్లో 35; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. 

ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన జార్ఖండ్‌ (+0.221)... ఆంధ్ర (–0.113) చేతిలో కేవలం 9 పరుగుల తేడాతో మాత్రమే ఓడటంతో మెరుగైన రన్‌రేట్‌తో తుదిపోరుకు అర్హత సాధించింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)