Breaking News

శ్రీకర్‌ 93; ఆంధ్ర 222/3

Published on Sun, 11/02/2025 - 03:58

కటక్‌: ఆంధ్ర ఓపెనర్‌ శ్రీకర్‌ భరత్‌ (129 బంతుల్లో 93; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు దిశగా సాగుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆంధ్ర శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 68 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. 

భరత్‌తో పాటు అభిషేక్‌ రెడ్డి (195 బంతుల్లో 76; 9 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీలు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 161 పరుగులు జోడించడంతో ఆంధ్ర జట్టుకు శుభారంభం దక్కింది. సెంచరీకి సమీపించిన తర్వాత భరత్‌ అవుట్‌ కాగా... కెప్టెన్  రికీ భుయ్‌ (0) విఫలమయ్యాడు. షేక్‌ రషీద్‌ (25 బ్యాటింగ్‌; 2 ఫోర్లు), కరణ్‌ షిండే (16 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఒడిశా బౌలర్లలో సంబిత్‌ బరల్‌ 2 వికెట్లు పడగొట్టాడు. 

సత్తాచాటిన రోహిత్‌ రాయుడు 
గత రెండు మ్యాచ్‌లను ‘డ్రా’తో సరిపెట్టుకున్న హైదరాబాద్‌ జట్టు... మూడో మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించింది. ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హిమాచల్‌ ప్రదేశ్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. 

ఆకాశ్‌ వశిష్ఠ (156 బంతుల్లో 114 బ్యాటింగ్‌; 14 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ శతకంతో కదంతొక్కగా... సిద్ధార్థ్‌ పురోహిత్‌ (37), అంకుశ్‌ (30), పుఖ్‌రాజ్‌ మాన్‌ (30), మయాంక్‌ డాగర్‌ (36) తలాకొన్ని పరుగులు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో రోహిత్‌ రాయుడు 3 వికెట్లు పడగొట్టగా... తనయ్‌ త్యాగరాజన్‌ 2 వికెట్లు తీశాడు. చామా మిలింద్, నిశాంత్‌ చెరో వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు.   

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)