Breaking News

ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్వర్ణం

Published on Thu, 02/06/2025 - 03:36

డెహ్రాడూన్‌: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. బుధవారం మహిళల కనోయ్‌ స్లాలోమ్‌ కే–1 విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగిడి గాయత్రి పసిడి పతకం సాధించింది. అంతకుముందు వెయిట్‌లిఫ్టింగ్‌లో నీలంరాజు, పల్లవి బంగారు పతకాలు గెలిచిన సంగతి తెలిసిందే. బుధవారమే ఆర్చరీలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక రజతం, ఒక కాంస్యం లభించాయి.

 కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో తిరుమూరు గణేశ్‌ మణిరత్నం–మాదాల సూర్య హంసిని జోడీ రజత పతకం గెలిచింది. ఫైనల్లో గణేశ్‌–సూర్య హంసిని ద్వయం 148–154 పాయింట్ల తేడాతో రిషభ్‌ యాదవ్‌–దీప్షిక (హరియాణా) జంట చేతిలో ఓడింది. కాంపౌండ్‌ పురుషుల వ్యక్తిగత విభాగంలో తిరుమూరు గణేశ్‌ మణిరత్నం కాంస్య పతకం సంపాదించాడు.  

తెలంగాణకు కాంస్యం 
మరోవైపు తెలంగాణ ఖాతాలో బుధవారం ఒక కాంస్య పతకం చేరింది. మహిళల ఆర్చరీ కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో చికిత, మానస నయన, శ్రేష్ణ రెడ్డి, మన్సూరా హసీబాలతో కూడిన తెలంగాణ జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 

తెలంగాణ జట్టు 232 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. బుధవారం పోటీలు ముగిశాక ఆంధ్రప్రదేశ్‌ 3 స్వర్ణాలు, 1 రజతం, 4 కాంస్యాలతో కలిపి 8 పతకాలతో 18వ స్థానంలో... తెలంగాణ 1 స్వర్ణం, 3 కాంస్యాలతో కలిపి 4 పతకాలతో 25వ స్థానంలో ఉన్నాయి. 

Videos

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు