Breaking News

శశికాంత్‌ మెరిపించినా...

Published on Sat, 01/04/2025 - 04:20

ముంబై: దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆంధ్ర జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో ఆంధ్ర జట్టు 5 వికెట్ల తేడాతో మహారాష్ట్ర చేతిలో ఓడింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శశికాంత్‌ (25 బంతుల్లో 52 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్‌ షాట్లతో అజేయ అర్ధశతకం సాధించాడు. 

అశ్విన్‌ హెబర్‌ (85 బంతుల్లో 45; 3 ఫోర్లు, 1 సిక్స్‌), షేక్‌ రషీద్‌ (75 బంతుల్లో 42; 2 ఫోర్లు, 1 సిక్స్‌), రికీ భుయ్‌ (47 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్‌), వినయ్‌ కుమార్‌ (40 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. ఈ టోర్నీలో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ శ్రీకర్‌ భరత్‌ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరగడంతో ఆంధ్ర జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. 

ఆఖర్లో శశికాంత్‌ భారీ షాట్లతో విరుచుకుపడటంతో పోరాడే స్కోరు చేయగలిగింది. మహారాష్ట్ర బౌలర్లలో రజనీశ్‌ గుర్బానీ 3, ముకేశ్‌ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం మహారాష్ట్ర 47.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సిద్ధేశ్‌ వీర్‌ (124 బంతుల్లో 115 నాటౌట్‌; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా... రాహుల్‌ త్రిపాఠి (78 బంతుల్లో 69; 9 ఫోర్లు) హాఫ్‌సెంచరీతో రాణించాడు. 

ఆంధ్ర బౌలర్లలో సందీప్‌ 2 వికెట్లు తీశాడు. గ్రూప్‌లో 6 మ్యాచ్‌లాడిన ఆంధ్ర 4 విజయాలు, 2 పరాజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో మూడో స్థానంలో ఉంది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)