Breaking News

ఆంధ్ర 344 ఆలౌట్‌

Published on Mon, 10/28/2024 - 03:16

సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హిమాచల్‌ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్‌ శశికాంత్‌ మూడు వికెట్లతో మెరిశాడు. గ్రూప్‌ ‘బి’లో భాగంగా విశాఖపట్నంలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న పోరులో ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి హిమాచల్‌ ప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 65 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. 

అంకిత్‌ (53; 3 ఫోర్లు), ఆకాశ్‌ వశిష్ట్‌ (52 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఓపెనర్లు శుభమ్‌ అరోరా (16), ప్రశాంత్‌ చోప్రా (10)తో పాటు... ఏకాంత్‌ సేన్‌ (20) విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్‌ 3 వికెట్లు పడగొట్టగా... విజయ్‌ ఒక వికెట్‌ తీశాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 295/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆంధ్ర జట్టు 92.4 ఓవర్లలో 344 పరుగులకు ఆలౌటైంది. ఆదివారం 49 పరుగులు చేసి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. 

మనీశ్‌ (42; 4 ఫోర్లు), త్రిపురాణ విజయ్‌ (33; 2 ఫోర్లు) చివర్లో కీలక పరుగులు చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ బౌలర్లలో దివేశ్‌ శర్మ 5 వికెట్లు పడగొట్టగా... రిషీ ధావన్‌ మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆంధ్ర జట్టు దీటుగా బదిలిస్తున్న హిమాచల్‌ ప్రదేశ్‌ జట్టు ఇంకా 146 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో ఆరు వికెట్లు ఉండగా... కెపె్టన్‌ రిషీ ధావన్‌ (38 బ్యాటింగ్‌; 4 ఫోర్లు), ఆకాశ్‌ వశి‹Ù్ట క్రీజులో ఉన్నారు. 

స్కోరు వివరాలు 
ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌: అభిõషేక్‌ రెడ్డి (ఎల్బీ) (బి) రిషీ ధావన్‌ 5; మహీప్‌ కుమార్‌ (ఎల్బీ) (బి) రిషీ ధావన్‌ 4; షేక్‌ రషీద్‌ (బి) అరి్పత్‌ 69; హనుమ విహారి (సి) రిషీ ధావన్‌ (బి) ముకుల్‌ నేగీ 66; శ్రీకర్‌ భరత్‌ (సి) ఆకాశ్‌ (బి) దివేశ్‌ శర్మ 65; అశ్విన్‌ హెబ్బర్‌ (సి) ఏకాంత్‌ సేన్‌ (బి) దివేశ్‌ శర్మ 15; మనీశ్‌ (సి) ముకుల్‌ నేగీ (బి) దివేశ్‌ శర్మ 42; త్రిపురాణ విజయ్‌ (సి) ఆకాశ్‌ వశి‹Ù్ట (బి) రిషీ ధావన్‌ 33; శశికాంత్‌ (సి) శుభమ్‌ అరోరా (బి) దివేశ్‌ శర్మ 6; లలిత్‌ మోహన్‌ (సి) శుభమ్‌ అరోరా (బి) దివేశ్‌ శర్మ 14; సత్యనారాయణ రాజు (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (92.4 ఓవర్లలో ఆలౌట్‌) 344. వికెట్ల పతనం: 1–5, 2–11, 3–136, 4–202, 5–226, 6–245, 7–317, 8–321, 9–341, 10–344. బౌలింగ్‌: వినయ్‌ 9–0–41–0; రిషీ ధావన్‌ 19–3–80–3; అర్పిత్‌ గులేరియా 11–0–47–1; దివేశ్‌ శర్మ 20.4–4–60–5; మయాంక్‌ డాగర్‌ 18–2–53–0; ముకుల్‌ నేగీ 15–2–52–1. 
హిమాచల్‌ ప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: శుభమ్‌ అరోరా (సి) శ్రీకర్‌ భరత్‌ (బి) శశికాంత్‌ 16; ప్రశాంత్‌ చోప్రా (సి) శ్రీకర్‌ భరత్‌ (బి) శశికాంత్‌ 10; అంకిత్‌ (బి) విజయ్‌ 53; ఏకాంత్‌ సేన్‌ (బి) శశికాంత్‌ 20; ఆకాశ్‌ వశిష్ట్‌ (బ్యాటింగ్‌) 52; రిషీ ధావన్‌ (బ్యాటింగ్‌) 38; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (65 ఓవర్లలో 4 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–12, 2–31, 3–59, 4–124. బౌలింగ్‌: శశికాంత్‌ 15–6–50–3; సత్యనారాయణ రాజు 14–1–40–0; లలిత్‌ మోహన్‌ 11–1–26–0; విజయ్‌ 13–1–41–1; మహీప్‌ కుమార్‌ 4–1–10–0; మనీశ్‌ 7–0–28–0; రషీద్‌ 1–0–2–0.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌