Breaking News

బరిలో దిగితే విధ్వంసమే..!

Published on Tue, 09/30/2025 - 09:55

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజల అభిమాన క్రీడగా మారిన క్రికెట్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు రాణిస్తున్నారు. సాధారణంగా విధ్వంస రచన చేసే టీ20 ఫార్మాట్‌లో విజయాన్ని శాసించే స్థాయికి బౌలర్లు ఎదిగారు. గెలుపే ఆకాంక్షగా బ్యాటింగ్‌ బరిలో దిగితే పరుగుల వర్షం కురిపిస్తున్నారు.  

అనంతపురం: ప్రపంచ వ్యాప్తంగా యమ క్రేజీ ఉన్న క్రికెట్‌లో అనంతపురం జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తూ రంజీ, దేశవాళీ టోరీ్నల్లో రాణిస్తున్నారు. ఏపీఎల్‌ (ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌) లోనూ అదరగొడుతున్నారు. పురుషులే కాదు ..మహిళలు కూడా తాము ఎందులోనూ తీసిపోమని సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా ఆర్డీటీ అందిస్తున్న శిక్షణతో రాటు దేలిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుతున్నారు.  

దత్తా.. సాటిలేని సత్తా  
ఆంధ్రా తరపున అండర్‌–19 విభాగంలో హర్యానాపై మచ్చా దత్తారెడ్డి ఏకంగా 172 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. మణిపూర్‌పై 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వికెట్‌ కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా ప్రతిభ కనబరుస్తున్నాడు. అండర్‌–23లో గోవాపై 102 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఏపీఎల్‌లోనూ రాణించాడు. కుడిచేతి ఓపెనింగ్‌ బ్యాట్స్‌ మెన్‌గా సత్తా చాటుతున్నాడు. 

బాల్‌ వేస్తే.. వికెట్‌ గిరగిరా.. 
గిరినాథరెడ్డి మంచి ఆల్‌రౌండర్‌. అండర్‌–25 విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు కెపె్టన్‌గా  వ్యవహరించాడు. ఏపీఎల్‌లో రాయలసీమ కింగ్స్‌ జట్టుకు కెపె్టన్‌గా ఉన్నాడు. కుడిచేతి బ్యాట్స్‌మెన్, మీడియం పేస్‌ బౌలింగ్‌తో ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. అండర్‌–23లో మధ్యప్రదేశ్‌ జట్టుపై 7 వికెట్లు తీసిన రికార్డు ఉంది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన గిరినాథరెడ్డి మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు.   

మల్లి బౌలింగ్‌తో ప్రత్యర్థి బెంబేలు  
రాప్తాడుకు చెందిన మల్లికార్జున ఎడమ చేతి స్పిన్నర్‌. ఆంధ్ర తరపున అండర్‌–16లో సిక్కింపై 8, గోవాపై 7 వికెట్లు కూలదోశాడు. అండర్‌–19 కేటగిరిలో బెంగాల్‌పై 7 వికెట్లు తీసి ఉత్తమ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. బీసీసీఐ అండర్‌–16 టోరీ్నలో అత్యధికంగా 38 వికెట్లు తీసిన రెండో క్రీడాకారుడిగా ఖ్యాతి దక్కించుకున్నాడు. ఏపీఎల్‌లోనూ రాణిస్తున్నాడు.   

‘ప్రశాంత’ంగా ఆడేస్తూ..  
డీబీ ప్రశాంత్‌కుమార్‌ ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌లో సెంచరీ సాధించాడు. రంజీ ట్రోఫీలో 85 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌పై ఆడిన మ్యాచ్‌లో 189 పరుగులు సాధించాడు. కుడిచేతి ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌ అయిన డీబీ ప్రశాంత్‌కుమార్‌ బరిలో ఉన్నంత సేపూ ప్రశాంతంగా ఆడుతూ ప్రత్యర్థి జట్టు విజయాకాశాలను దెబ్బ తీయడంలో దిట్టగా పేరుగాంచాడు.   

అర్జున్‌.. రన్‌ మెషీన్‌ 
కుడిచేతి ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా అర్జున్‌ టెండూల్కర్‌ సత్తా చాటుతున్నాడు. అండర్‌ –19 , అండర్‌–23 కేటగిరిలో రాణించాడు. సీనియర్‌ వన్డే అంతర జిల్లా టోరీ్నలో 127 పరుగులు సాధించాడు. రెండు అర్ధసెంచరీలు చేశాడు. కుడి చేతి ఆఫ్‌ స్పిన్నర్‌గా ఆల్‌రౌండర్‌ ప్రతిభ చాడుతున్న అర్జున్‌ టెండుల్కర్‌ స్వగ్రామం ధర్మవరం మండలం గొట్లూరు గ్రామం.   

బౌలింగ్‌ మాయాజాలం  
కురుగుంట గ్రామానికి చెందిన ఎలక్ట్రికల్‌ డైలీ వర్కర్‌ రవి, ఆయన భార్య నారాయణమ్మ తాము పడుతున్న కష్టం తమ బిడ్డ వినయ్‌కుమార్‌ పడకూడదని భావించారు. చదువుతో పాటు క్రికెట్‌లోనూ శిక్షణ ఇప్పించారు. వారి నమ్మకాన్ని వినయ్‌కుమార్‌ వమ్ము చేయలేదు. 2013 నుంచి 2017 వరకు అనంతపురం క్రికెట్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. ఆర్డీటీ కోచ్‌లు నరే‹Ù, ఆర్‌.కుమార్‌ వద్ద మెలకువలు నేర్చుకుని, అండర్‌–19, 23, 25 టోరీ్నలతో పాటు రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లోనూ తిరుగులేని ప్రతిభను చాటాడు. తన బౌలింగ్‌ మాయాజాలంతో హజరా ట్రోపీలో ఏకంగా 6 వికెట్లు తీసి సత్తా చాటాడు.   

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)