Breaking News

‘విషీ’ని దాటిన గుకేశ్‌

Published on Sat, 09/02/2023 - 02:45

చెన్నై: 1986 జులై 1... చదరంగ మేధావి విశ్వనాథన్‌ ఆనంద్‌ భారత నంబర్‌వన్‌ ఆటగాడిగా మొదటిసారి గుర్తింపు తెచ్చుకున్న రోజు. నాటినుంచి ఇప్పటి వరకు అతనిదే అగ్ర స్థానం. అతని తర్వాత భారత్‌నుంచి పెద్ద సంఖ్యలో కుర్రాళ్లు సత్తా చాటుతూ వచ్చినా... వారితో పోటీ పడుతూ సత్తా చాటిన ఆనంద్‌ 37 సంవత్సరాలుగా ‘టాప్‌’లోనే నిలిచాడు. ఒక తరం పాటు ఆటను శాసించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆనంద్‌ ఇప్పుడు తొలిసారి తన భారత నంబర్‌వన్‌ స్థానాన్ని కోల్పోయాడు.

17 ఏళ్ల దొమ్మరాజు గుకేశ్‌ ఇప్పుడు టాప్‌ ర్యాంక్‌లోకి వచ్చాడు. అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) శుక్రవారం అధికారికంగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రకటించింది. ఇందులో గుకేశ్‌ 8వ ర్యాంక్‌లో నిలవగా... విశ్వనాథన్‌ ఆనంద్‌ 9వ ర్యాంక్‌లో ఉన్నాడు. గుకేశ్‌ రేటింగ్‌ 2758 కాగా, ఆనంద్‌ రేటింగ్‌ 2754గా ఉంది. ఇటీవల జరిగిన వరల్డ్‌ కప్‌ సమయంలోనే ‘లైవ్‌ రేటింగ్‌’లో ఆనంద్‌ను గుకేశ్‌ అధిగమించాడు.

అయితే ఇప్పుడు ‘ఫిడే’ ర్యాంకింగ్‌ ద్వారా అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. టాప్‌–30 ర్యాంకింగ్స్‌లో వీరిద్దరితో పాటు భారత్‌ నుంచి ఆర్‌. ప్రజ్ఞానంద (19), విదిత్‌ గుజరాతీ (27), అర్జున్‌ ఎరిగైశి (29) ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ 31వ స్థానంలో కొనసాగుతున్నాడు. 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల గ్రాండ్‌మాస్టర్‌గా మారిన గుకేశ్‌ అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)