Breaking News

వ్యభిచారం కేసులో ఒలింపిక్‌ చాంపియన్‌ అరెస్టు

Published on Wed, 05/21/2025 - 03:44

కొలంబస్‌: అమెరికా స్టార్‌ రెజ్లర్‌ కైల్‌ స్నైడర్‌ వ్యభిచారం కేసులో అరెస్టయ్యాడు. 20 ఏళ్ల వయసులో రియో ఒలింపిక్స్‌ (2016)లో ఫ్రీస్టయిల్‌ 97 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన స్నైడర్‌ టోక్యో ఒలింపిక్స్‌ (2020)లో రజత పతకం సాధించాడు. పిన్నవయసులో అమెరికా రెజ్లింగ్‌ చాంపియన్‌గా ఘనతకెక్కిన స్నైడర్‌ను వ్యభిచారం కేసులో ఈ నెల 9న అమెరికా పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో స్నైడర్‌ హోటల్‌ గదిలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. 

29 ఏళ్ల స్నైడర్‌ను తాజాగా కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి అతనికి 250 అమెరికన్‌ డాలర్లు (రూ. 21,386) జరిమానా విధించడంతో పాటు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కోసం ఒక రోజంతా పని చేయాలని ఆదేశించారు. తీర్పు అనంతరం తన తప్పుపట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన రెజ్లర్‌ ఇకపై సరైన నిర్ణయాలతో జీవితాన్ని కొనసాగిస్తానని, తన తప్పువల్ల కుటుంబం పడిన వేదన తనకు అర్థమైందని వాపోయాడు. 

అతని భార్య మ్యాడీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌! రెండు వరుస ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన స్నైడర్‌ గతేడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో ఓడి నాలుగో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్నైడర్‌ మూడు స్వర్ణ పతకాలు (2015, 2017, 2022), రెండు రజత పతకాలు (2018, 2021), రెండు కాంస్య పతకాలు (2019, 2023) సాధించాడు. అమెరికాలోని నేషనల్‌ కాలేజ్‌ అథ్లెటిక్‌ అసోసియేషన్‌ (ఎన్‌సీఏఏ) క్రీడల్లో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచాడు. 

ఓవరాల్‌గా తన 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో స్నైడర్‌ 30 స్వర్ణ పతకాలు, 5 రజత పతకాలు, 7 కాంస్య పతకాలు గెలిచాడు. 199 బౌట్‌లలో నెగ్గి, 21 బౌట్‌లలో మాత్రమే ఓడిపోయాడు. ఇటీవలే అతను రియల్‌ అమెరికన్‌ ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌ లీగ్‌లో పాల్గొనేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు.   

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)