అనిసిమోవా అదరహో

Published on Fri, 09/05/2025 - 02:31

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో అమెరికా స్టార్, ఎనిమిదో సీడ్‌ అమండ అనిసిమోవా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో అనిసిమోవా 6–4, 6–3తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌)ను ఓడించిది. ఈ గెలుపుతో... గత జూలై 12న ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ టోర్నీ ఫైనల్లో ఒక్క గేమ్‌ కూడా నెగ్గకుండా 0–6, 0–6తో స్వియాటెక్‌ చేతిలో ఎదురైన దారుణ ఓటమికి అనిసిమోవా బదులు తీర్చుకుంది. 

‘వింబుల్డన్‌ ఫైనల్లో ఘోర పరాజయం తర్వాత పుంజుకొని స్వియాటెక్‌పై నెగ్గడం నాకెంతో ప్రత్యేకం. ఆ ఓటమి నుంచి తేరుకోవడానికి నేను చాలా శ్రమించాను. నా కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు లభించినందుకు ఆనందంగా ఉంది’ అని తొలిసారి యూఎస్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌ చేరిన అనిసిమోవా వ్యాఖ్యానించింది. స్వియాటెక్‌తో 96 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో అనిసిమోవా మూడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, స్వియాటెక్‌ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. 

23 విన్నర్స్‌ కొట్టిన అనిసిమోవా 12 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు స్వియాటెక్‌ మూడు డబుల్‌ ఫాల్ట్‌లతోపాటు 15 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ఫైనల్లో చోటు కోసం నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ విజేత నయోమి ఒసాకా (జపాన్‌)తో అనిసిమోవా తలపడుతుంది. మరో క్వార్టర్‌ ఫైనల్లో 23వ సీడ్‌ ఒసాకా 6–4, 7–6 (7/3)తో 11వ ర్యాంకర్‌ కరోలినా ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై విజయం సాధించింది.  

సినెర్‌ దూకుడు 
పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఇటలీకే చెందిన 10వ సీడ్‌ ముసెట్టితో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో సినెర్‌ 6–1, 6–4, 6–2తో నెగ్గాడు.  సినెర్‌ పది ఏస్‌లు సంధించడంతోపాటు ముసెట్టి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేశాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో 25వ సీడ్‌ ఫెలిక్స్‌ (కెనడా) 4–6, 7–6 (9/7), 7–5, 7–6 (7/4)తో ఎనిమిదో సీడ్‌ డిమినార్‌ (ఆ్రస్టేలియా)పై గెలిచాడు. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)