Breaking News

Virat Kohli: రాజస్తాన్‌తో కీలక మ్యాచ్‌.. కోహ్లి ప్లాన్‌ ఇదే

Published on Wed, 05/22/2024 - 13:56

ఐపీఎల్‌-2024లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అద్భుతాలు చేసింది. వరుసగా ఆరు ఓటముల తర్వాత... అనూహ్య రీతిలో పుంజుకుని ఏకంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి టాప్‌-4కు అర్హత సాధించి.. టైటిల్‌ రేసులో నిలవగలిగింది.

రాజస్తాన్‌ రాయల్స్‌తో అమీ తుమీ
ఈ క్రమంలో ఎలిమినేటర్‌ రూపంలో తొలి గండం దాటేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. రాజస్తాన్‌ రాయల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో అమీ తుమీ తేల్చుకోనుంది.

ఇక ఆర్సీబీ వరుస విజయాల్లో ఆ జట్టు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌తో పాటు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిది కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. కోహ్లి ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 14 ఇన్నింగ్స్‌లో కలిపి 708 పరుగులు సాధించాడు.

తద్వారా టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతూ ఆరెంజ్‌ క్యాప్‌ను తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇక రాజస్తాన్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌ నేపథ్యంలో విరాట్‌ కోహ్లి తన ఆట తీరు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

బౌలర్ల విషయంలో నా ప్లాన్‌ ఇదే
‘‘అతిగా ఆలోచించడం నాకు ఇష్టం ఉండదు. గణాంకాలను నేను పెద్దగా పట్టించుకోను. ప్రత్యర్థి జట్టు బౌలర్‌ .. రిస్ట్‌ పొజిషన్‌ ఏంటి? బాల్‌ ఎక్కడ వేస్తాడు? అన్న విశ్లేషణలకు సంబంధించిన వీడియోలు చూడను.

ఎందుకంటే.. మ్యాచ్‌ నాటికి ఆ బౌలర్‌ సరికొత్త, విభిన్న ప్రణాళికతో మన ముందుకు రావచ్చు కదా! అందుకే నేను పరిస్థితులకు తగ్గట్లుగా ఆడేందుకే మొగ్గు చూపుతా.

బౌలర్‌ బంతిని సంధించే సమయంలో కేవలం నా కళ్లను మాత్రమే నమ్ముకుంటా. బాల్‌కు రియాక్ట్‌ అయ్యే విషయంలో నా మెదడు ఏది చెబితే అదే చేస్తా. మనకు మనంగా నిర్ణయాలు తీసుకోగలిగితే సమస్యలకు సరైన పరిష్కారాలు కనుగొనే వీలుంటుందని నేను బలంగా నమ్ముతాను. 

బేసిక్స్‌ మర్చిపోను
కంప్యూటర్‌ అనాలసిస్‌తో పరిస్థితులను అంచనా వేయలేం. మైదానంలో అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలే ఫలితాలనిస్తాయి. బేసిక్స్‌ను నేనెప్పుడూ మర్చిపోను. 

వాటి ఆధారంగానే మూడు ఫార్మాట్లలోనూ నేను ఒకే విధంగా ఆడటానికి ఒక రకంగా ఇదే కారణం అని చెప్పవచ్చు’’ అని విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: RR vs RCB: వార్‌ వన్‌సైడ్‌.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)