Breaking News

నిఖత్‌ ‘డబుల్‌’ ధమాకా

Published on Sat, 09/30/2023 - 02:25

తన పంచ్‌ పవర్‌ ఎలా ఉంటుందో భారత మహిళా స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ మరోసారి చాటుకుంది. ఆసియా క్రీడల్లో తొలిసారి పాల్గొంటున్న ఈ తెలంగాణ బాక్సర్‌ 50 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకోవడంతోపాటు వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడలకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో నిఖత్‌ కేవలం 53 సెకన్లలో రిఫరీ స్టాప్స్‌ కంటెస్ట్‌ (ఆర్‌ఎస్‌సీ) పద్ధతిలో విజయాన్ని అందుకుంది.

హనన్‌ నాసర్‌ (జోర్డాన్‌)తో జరిగిన ఈ బౌట్‌లో నిఖత్‌ సంధించిన పంచ్‌లకు ఆమె ప్రత్యర్థి బెంబేలెత్తిపోయింది. దాంతో మూడు నిమిషాల నిడివి గల తొలి రౌండ్‌లో 53 సెకన్లు ముగియగానే రిఫరీ బౌట్‌ను నిలిపివేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించారు. గత ఏడాది బర్మింగ్‌హమ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో.. 2022, 2023 ప్రపంచ చాంపియన్‌íÙప్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన నిఖత్‌ ఆసియా క్రీడల పతకాన్ని కూడా ఖాయం చేసుకుంది.

‘క్వార్టర్‌ ఫైనల్లో గెలవడంతోపాటు తొలిసారి ఒలింపిక్స్‌ క్రీడలకు అర్హత సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. నా తదుపరి లక్ష్యం పారిస్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే’ అని 27 ఏళ్ల నిఖత్‌ వ్యాఖ్యానించింది. ఆదివారం జరిగే సెమీఫైనల్లో చుథామట్‌ రక్సత్‌ (థాయ్‌లాండ్‌)తో నిఖత్‌ తలపడుతుంది. మరోవైపు 57 కేజీల విభాగంలో పర్వీన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరగా.. పురుషుల 80 కేజీల విభాగంలో లక్ష్య చహర్‌ ఓడిపోయాడు. పరీ్వన్‌ 5–0తో జిచున్‌ జు (చైనా)పై నెగ్గగా... లక్ష్య చహర్‌ 1–4తో ఒముర్‌బెక్‌ (కిర్గిస్తాన్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు.

Videos

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)