Breaking News

ఆదుకున్న ములానీ

Published on Fri, 09/13/2024 - 04:09

సాక్షి, అనంతపురం: ఆల్‌రౌండర్‌ షమ్స్‌ ములానీ (174 బంతుల్లో 88 బ్యాటింగ్‌; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో దులీప్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌ ‘డి’తో గురువారం మొదలైన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 82 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ప్రధాన ఆటగాళ్లు విఫలమైన చోట... ములానీ చక్కటి ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ‘ఎ’ జట్టుకు శుభారంభం దక్కలేదు. 

కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (7)తో పాటు మరో ఓపెనర్‌ ప్రథమ్‌ సింగ్‌ (7) సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో 21 పరుగులకే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత హైదరాబాద్‌ ఆటగాడు తిలక్‌ వర్మ (10), రియాన్‌ పరాగ్‌ (37; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌), శాశ్వత్‌ రావత్‌ (15) ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో భారత్‌ ‘ఎ’ జట్టు 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కాసేపటికే కుమార్‌ కుశాగ్ర (28) కూడా వెనుదిరిగాడు. 

ఈ దశలో తనుశ్‌ కొటియాన్‌ (53; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌)తో కలిసి షమ్స్‌ ములానీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. టాపార్డర్‌ సత్తా చాటలేకపోయిన చోట సంయమనంతో క్రీజులో నిలిచి ఒక్కో పరుగు జోడి స్తూ స్కోరు బోర్డు ను ముందుకు నడిపించాడు. అతడికి తనుశ్‌ నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 91 పరుగులు జోడించారు. ఆట ముగిసే సమయానికి షమ్స్‌ ములానీతో పాటు ఖలీల్‌ అహ్మద్‌ (15 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు.  

స్కోరు వివరాలు 
భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌: ప్రథమ్‌ సింగ్‌ (సి) అర్‌‡్షదీప్‌ (బి) విద్వత్‌ 7; మయాంక్‌ (సి) సామ్సన్‌ (బి) విద్వత్‌ 7; తిలక్‌ వర్మ (సి) శ్రేయస్‌ (బి) సారాంశ్‌ జైన్‌ 10; రియాన్‌ పరాగ్‌ (సి) పడిక్కల్‌ (బి) అర్‌‡్షదీప్‌ 37; శాశ్వత్‌ రావత్‌ (సి) శ్రేయస్‌  (బి) హర్షిత్‌ రాణా 15; కుశాగ్ర (సి) యశ్‌ దూబే (బి) అర్‌‡్షదీప్‌ 28; షమ్స్‌ ములానీ (బ్యాటింగ్‌) 88; తనుశ్‌ (సి) అర్‌‡్షదీప్‌ (బి) సౌరభ్‌ 53; ప్రసిద్ధ్‌ కృష్ణ (సి) (సబ్‌) శ్రీకర్‌ భరత్‌ (బి) హర్షిత్‌ రాణా 8; ఖలీల్‌ అహ్మద్‌ (బ్యాటింగ్‌) 15; ఎక్స్‌ట్రాలు: 20; మొత్తం: (82 ఓవర్లలో 8 వికెట్లకు) 288. వికెట్ల పతనం: 1–18, 2–21, 3–65, 4–69, 5–93, 6–144, 7–235, బౌలింగ్‌: హర్షిత్‌ రాణా 16–4–49–2; విద్వత్‌ 14–5–30–2; అర్‌‡్షదీప్‌ 18–3–73–2; సారాంశ్‌ జైన్‌ 14–3–55–1; సౌరభ్‌ కుమార్‌ 20–1–65–1.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)