Breaking News

Oman T20 WC Squad: టీ20 వరల్డ్‌కప్‌కు జట్టును ప్రకటించిన ఒమన్.. కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

Published on Wed, 05/01/2024 - 18:27

టీ20 వరల్డ్‌కప్‌-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఒమన్ క్రికెట్‌ బోర్డు బుధవారం ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్‌ అకిబ్‌ ఇలియాస్‌ సారథ్యం వహించనున్నాడు.  ఇప్పటివరకు తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన జీషన్ మక్సూద్‌పై వేటు వేసిన ఒమన్ క్రికెట్‌.. ఆ బాధ్యతలను ఇలియాస్‌ అప్పగించింది. 

ఇలియస్‌ గత కొంత కాలంగా ఒమన్‌ క్రికెట్‌ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక ఇటీవల ఏసీసీ ప్రీమియర్ కప్‌లో అదరగొట్టిన ఆటగాళ్లకు వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కింది. ఈ జట్టులో బిలాల్ ఖాన్, కలీముల్లా, జీషన్ మక్సూద్ వంటి సీనియర్‌ ఆటగాళ్లు ఉన్నారు.

అయితే మరో సీనియర్‌ ఆటగాడు జతీందర్ సింగ్‌కు ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. జతీందర్ సింగ్‌కు రిజర్వ్‌ ఆటగాళ్ల జాబితాలో చోటుక్కింది.  ఇ​క ఈ మెగా ఈవెంట్‌ కోసం ఇప్పటికే భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. జూన్‌ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. 

తుది జట్లు
అకిబ్ ఇలియాస్ (కెప్టెన్‌), జీషన్ మక్సూద్, కశ్యప్ ప్రజాపతి, ప్రతీక్ అథవాలే (వికెట్‌ కీపర్‌), అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, మొహమ్మద్ నదీమ్, నసీమ్ ఖుషీ (వికెట్‌ కీపర్‌), మెహ్రాన్ ఖాన్, బిలాల్ ఖాన్, రఫీవుల్లా, కలీముల్లా, ఫయాజ్ బట్, షకీల్ అహ్మద్.

రిజర్వ్‌లు: జతీందర్ సింగ్, సమయ్ శ్రీవాస్తవ, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా
 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు