Breaking News

2026కు అదిరిపోయే ఆరంభం.. ఏడాది తొలి మ్యాచ్‌లోనే ఆసక్తికర ఫలితం

Published on Fri, 01/02/2026 - 14:39

క్రికెట్‌కు సంబంధించి 2026 స​ంవత్సరానికి అదిరిపోయే ఆరంభం లభించింది. ఏడాది తొలి మ్యాచ్‌లోనే ఆసక్తికర ఫలితం వచ్చింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025-26లో భాగంగా డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌, జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగి, సూపర్‌ ఓవర్‌ వరకు వెళ్లింది. సూపర్‌ ఓవర్‌లో జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ పైచేయి సాధించింది.

ఈ మధ్యలో హైడ్రామా చోటు చేసుకుంది. జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు డొనొవన్‌ ఫెరియెరా (డాన్‌) ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టి, ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఆల్‌రౌండ్‌ షో అంటే బ్యాటింగ్‌, బౌలింగ్‌ మత్రమే కాదు వికెట్‌కీపింగ్‌ కూడా.

తొలుత బ్యాటింగ్‌లో సుడిగాలి ఇన్నింగ్స్‌ (10 బంతుల్లో 33 నాటౌట్‌; ఫోర్‌, 4 సిక్సర్లు) ఆడిన డాన్‌.. ఆతర్వాత బౌలింగ్‌లో (4-0-24-1), ఆఖర్లో వికెట్‌ కీపింగ్‌లో (చివరి బంతికి ఒక పరుగు చేస్తే ప్రత్యర్ది గెలిచే సమయంలో అద్భుతమైన రనౌట్‌ చేశాడు) అదరగొట్టి ఓడిపోవాల్సిన మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌ వరకు తీసుకెళ్లాడు. సూపర్‌ ఓవర్‌లో రిలీ రొస్సో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి సూపర్‌ కింగ్స్‌ను గెలిపించాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ కింగ్స్‌.. డివిలియర్స్‌ (38), డుప్లెసిస్‌ (47), శుభమ్‌ రంజనే (50 నాటౌట్‌), డొనొవన్‌ ఫెరియెరా (33 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. డర్బన్‌ బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ (4-0-12-3) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. హార్మర్‌ (4-0-22-1) కూడా పర్వాలేదనిపించాడు.

అనంతరం 206 పరుగుల లక్ష్య ఛేదనలో డర్బన్‌ జట్టు చివరి బంతి వరకు గెలుపు కోసం​ పోరాడింది. చివరి బంతికి ఒక్క పరుగు చేస్తే గెలుస్తుందన్న తరుణంలో డాన్‌ మ్యాజిక్‌ రనౌట్‌ చేసి మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌ వరకు తీసుకెళ్లాడు. ముల్దర్‌ బౌలింగ్‌లో బ్యాటింగ్‌ చేసిన హార్మర్‌ బంతిని కట్‌ చేసే క్రమంలో మిస్‌ అయ్యాడు. అయినా పరుగుకు ప్రయత్నించగా.. అప్పుడు వికెట్‌కీపింగ్‌ చేస్తున్న డాన్‌ అద్భుతమైన రీతిలో బాష్‌ను రనౌట్‌ చేశాడు. దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది.

సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన డర్బన్‌ వికెట్‌ కోల్పోయి 5 పరుగులు మాత్రమే చేయగలిగింది. గ్లీసన్‌ అద్బుతంగా బౌలింగ్‌ చేసి డర్బన్‌ బ్యాటర్లు జోస్‌ బట్లర్‌, ఆరోన్‌ జోన్స్‌ను కట్టడి చేశాడు. 6 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రిలీ రొస్సో 3 బంతుల్లో 2 బౌండరీలు బాది సూపర్‌ కింగ్స్‌ను గెలిపించాడు.

 

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)