విలన్‌గా మారిన ఆసీస్‌ కీపర్‌.. కటింగ్‌షాపులో డబ్బులు ఎగ్గొట్టి

Published on Sat, 07/08/2023 - 17:59

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా లీడ్స్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడోరోజు ఆటకు వరుణుడు అడ్డు పడ్డాడు. ఇప్పటికైతే ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ట్రెవిస్‌ హెడ్‌ 18, మిచెల్‌ మార్ష్‌ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెయిర్‌ స్టో ఔట్‌ వివాదంతో ఆసీస్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీ విలన్‌గా మారిపోయాడు. లీడ్స్‌ వేదికగా మొదలైన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ అభిమానులు అలెక్స్‌ కేరీని టార్గెట్‌ చేస్తూ గేలి చేశారు''ఆడింది చాలు.. పెవిలియన్‌ వెళ్లు.. అంటూ షూ, చెప్పులు చూపించడం'' వైరల్‌గా మారింది. 

ఇంగ్లీష్ మీడియాలో యాషెస్ విల‌న్‌గా ముద్ర ప‌డిన అలెక్స్‌ కేరీ తన చర్యతో  మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. లీడ్స్‌లోని ఒక‌ కటింగ్‌షాపు ఓనర్‌కు డబ్బులు ఎగ్గొట్టాడు. దాంతో స‌ద‌రు వ్య‌క్తి కేరీకి డెడ్‌లైన్ విధించాడు. విషయంలోకి వెళితే.. ఆడం మహ‌మూద్ అనే బార్బ‌ర్ వ‌ద్ద కేరీ క‌టింగ్ చేసుకున్నాడు.అందుకు 30 యూరోలు అంటే.. మ‌న క‌రెన్సీలో రూ.2,718 అయింది.

అయితే ఆసీస్ కీప‌ర్ త‌న వ‌ద్ద అంత డ‌బ్బు లేదని త‌ప్ప‌కుండా ఇచ్చేస్తాన‌ని ఆడంతో పేర్కొన్నాడు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు అత‌డికి పైసా కూడా ఇవ్వ‌లేదు. దాంతో చిర్రెత్తుకొచ్చిన మ‌హ‌మూద్.. క్యారీకి డెడ్‌లైన్ విధించాడు. ఈ సోమ‌వారం(జూలై 10)లోగా డ‌బ్బులు ముడితే తాను సంతోషిస్తాన‌ని లేదంటే త‌న ఆగ్ర‌హానికి గురి కావాల్సి వ‌స్తుంద‌ని తెలిపాడు. అయితే అలెక్స్‌ కేరీ ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

చదవండి: IND Vs WI: అంతా కొత్త మొహాలే.. ఎవర్రా మీరంతా? 

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)