Breaking News

టీమిండియాకు భారీ షాక్‌.. స్టార్ ప్లేయ‌ర్‌కు గాయం

Published on Thu, 01/02/2025 - 08:30

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ 2024-25లో మ‌రో కీల‌క పోరుకు టీమిండియా సిద్ద‌మైంది. సిడ్నీ వేదిక‌గా శుక్ర‌వారం(జ‌న‌వ‌రి 3) నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న ఐదో టెస్టులో భార‌త్ అమీ తుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 2-2తో స‌మం చేయాల‌ని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది.

అయితే ఈ మ్యాచ్‌కు ముందు భార‌త జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. సిడ్నీ టెస్టుకు యువ పేస‌ర్ ఆకాష్ దీప్ గాయం కార‌ణంగా దూరం కానున్న‌ట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ క‌థనం ప్రకారం.. ఆకాష్ దీప్ వెన్ను నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రిగిన నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి ఆకాష్‌ కేవ‌లం 43 ఓవ‌ర్ల బౌలింగ్ మాత్ర‌మే చేశాడు. దీంతో అత‌డికి ఆఖరి టెస్టుకు విశ్రాంతి ఇవ్వాల‌ని భార‌త జ‌ట్టు మెనెజ్‌మెంట్ నిర్ణ‌యించిందంట‌.

ఆకాష్ స్ధానంలో క‌ర్ణాట‌క స్పీడ్ స్టార్ ప్ర‌సిద్ద్ కృష్ణ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా-ఎతో జరిగిన అనాధికరిక టెస్టుల్లో కృష్ణ అద్భుతంగా రాణించాడు.

ఈ క్రమంలోనే తొలి రెండు టెస్టులు ఆడిన హర్షిత్‌ రానాను కాదని ప్రసిద్ద్‌కు చాన్స్‌ ఇవ్వాలని గంభీర్‌ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గత రెండు మ్యాచ్‌ల్లో బుమ్రా తర్వాత అత్యుత్తమ బౌలర్‌గా నిలిచిన ఆకాష్ దీప్.. సిడ్నీ టెస్టుకు దూరమైతే భారత్‌కు నిజంగా గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి.

బ్రిస్బేన్‌ టెస్టు డ్రా ముగియడంలో దీప్‌ది కీలక పాత్ర. ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓటమి పాలైతే డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది.
చదవండి: బుమ్రా లేకుంటే బీజీటీ ఏకపక్షమే: గ్లెన్‌ మెక్‌గ్రాత్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)