Breaking News

'గాయాన్ని సైతం లెక్క చేయని మీ పోరాటం అసమానం'

Published on Sat, 06/10/2023 - 15:54

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియనషిప్‌ ఫైనల్లో టీమిండియా స్టార్‌ బ్యటర్లంతా మూకుమ్మడిగా విఫలమైన చోట అజింక్యా రహానే ఒక్కడే పోరాడాడు. లార్డ్‌ శార్దూల్‌ ఠాకూర్‌ సహాయంతో టీమిండియాను ఫాలోఆన్‌ గండం నుంచి బయటపడేశాడు. 512 రోజుల తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఆసీస్‌ బౌలర్ల నుంచి బులెట్‌లా దూసుకొస్తున్న బంతులు రహానేను పలుమార్లు గాయపరిచాయి.

అయినా రహానే ఏమాత్రం బెదరకుండా తన ఆటను కొనసాగించాడు. సెంచరీ చేయకపోయినప్పటికి 129 బంతుల్లో 89 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. రహానే చేసిన పోరాటానికైనా టీమిండియా మ్యాచ్‌ గెలవాలని కోరుకుందాం. ఒకవేళ టీమిండియా ఓడినా రహానే ఇన్నింగ్స్‌ మాత్రం గుర్తుండిపోతుంది.

రహానే స్పూర్తిదాయక ఇన్నింగ్స్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్న వేళ.. అతని భార్య రాధికా దొపోవ్‌కర్‌ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తన భర్త ఆటతీరుపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.  

''పలుమార్లు వేలికి గాయాలు అయినా స్కాన్‌ చేయించుకోవడానికి నిరాకరించి పట్టుదలతో బ్యాటింగ్‌ చేశారు. ఆట పట్ల మీకున్న అంకితభావానికి హ్యాట్సాఫ్‌. మీ నిస్వార్థత, సంకల్పబలం చాలా గొప్పది.. ఈ రెండింటిని ఒక అంశంలో జోడించి ఇవాళ బ్యాటింగ్‌ చేసి అందరిలో స్పూర్తి నింపారు. జట్టును గెలిపించడంకోసం మీరు ప్రదర్శించిన స్పిరిట్‌కు గర్విస్తున్నా.. మై రీసైలెంట్‌ పార్టనర్‌.. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా'' అంటూ రాసుకొచ్చింది.

కాగా మూడోరోజు ఆట ముగిసిన తర్వాత రహానే మాట్లాడుతూ.. ''ఈరోజు బ్యాటింగ్‌ చేసిన విధానంపై హ్యాపీగా ఉన్నా. శార్దూల్‌తో కలిసి మంచి భాగస్వామ్యం ఏర్పడడంతో కనీసం 320 నుంచి 330 పరుగులు చేస్తామనుకున్నాం. కానీ అది జరగలేదు. అయితే మా ప్రదర్శన ఇంతటితో ఆగలేదు.. మ్యాచ్‌ గెలిచేందుకు పోరాడుతాం. నాలుగోరోజు ఉదయం సెషన్‌ మాకు కీలకం. జడేజా బౌలింగ్‌ బాగుంది. అతను కీలకంగా మారే అవకాశం ఉంది. సీమ్‌ బౌలర్స్‌ కూడా సహకరించే అవకాశం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. 

చదవండి: రీఎంట్రీలో ఆపద్భాందవుడి పాత్ర.. భారత్‌ తరపున తొలి బ్యాటర్‌గా

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)