Breaking News

వారి వాళ్లే ఈ మ్యాచ్‌లో గెలిచాము.. సంతోషంగా ఉంది: అజింక్య ర‌హానే

Published on Sun, 05/04/2025 - 22:31

ఐపీఎల్‌-2025లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ త‌మ ప్లేఆఫ్స్ ఆశ‌ల‌ను మ‌రింత ప‌దిలం చేసుకుంది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో ఒక్క ప‌రుగు తేడాతో కేకేఆర్ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో కోల్‌క‌తా ఆరో స్దానానికి చేరుకుంది. 

207 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో త‌మ‌ విజ‌యానికి 22 ప‌రుగులు అవస‌ర‌మ‌వ్వ‌గా.. రాజ‌స్తాన్ 20 ప‌రుగులు చేయ‌గల్గింది. శుభ‌మ్ దూబే ఆఖ‌రి ఓవ‌ర్‌లో మెరుపులు మెరిపించిన‌ప్ప‌టికి త‌న జ‌ట్టును మాత్రం గెలిపించ‌లేక‌పోయాడు. 

అదేవిధంగా రాజ‌స్తాన్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్‌(95) అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో మోయిన్ అలీ, హ‌ర్షిత్ రాణా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌లా వికెట్ సాధించారు. ఇక ఈ విజ‌యంపై మ్యాచ్ అనంత‌రం కేకేఆర్ కెప్టెన్ అజింక్య ర‌హానే స్పందించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత‌మైన ఫీల్డింగ్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన త‌మ ఆట‌గాళ్ల‌పై ర‌హానే ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

"ఉత్కంఠ పోరులో విజ‌యం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక‌టి లేదా రెండు పరుగుల తేడాతో గెలిచినప్పుడు ఆ విజ‌యం మన‌కు చాలా సంతృప్తిని ఇస్తుంది.  గుర్భాజ్‌, అంగ్‌క్రిష్ చాలా బాగా ఆడారు. వీరితో పాటు ర‌స్సెల్ మాకు అద్బుత‌మైన ముగింపు అందించాడు.

పవ‌ర్‌ప్లేలో దూకుడుగా ఆడి, ఆ త‌ర్వాత 12 ఓవ‌ర్ వ‌ర‌కు ఆచితూచి ఆడాల‌న్న‌ది మా ప్ర‌ణాళిక‌. నేను, అంగ్‌క్రిష్ వీలైనంత‌వ‌ర‌కు క్రీజులో ఉండాల‌నుకున్నాము. ఫీల్డింగ్‌లో మా బాయ్స్ అద్బుతం చేశారు. మా ఫీల్డ‌ర్లు 10 నుంచి 12 ప‌రుగులు కాపాడారు. ఇదే మా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది. రెండు మంచి క్యాచ్‌లు తీసుకొని, ఓ రనౌట్ చేయగలిగితే మ్యాచ్ స్వ‌రూపమే మారిపోతుంద‌ని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేష‌న్‌లో ర‌హానే పేర్కొన్నాడు.

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)