రిటైర్మెంట్‌ ప్రకటించిన అజింక్య రహానే

Published on Thu, 07/30/2026 - 10:35

టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ అజింక్య రహానే కీలక నిర్ణయం తీసుకున్నాడు. 38 ఏళ్ల ర‌హానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ ముంబై క్రికెట‌ర్ గురువారం సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించాడు. కాగా  ర‌హానే భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో విదేశీ గ‌డ్డ‌పై అత‌డి రికార్డు అత్యద్భుతం. ఈ సీనియర్ క్రికెటర్ కెప్టెన్‌గా కూడా తన మార్క్ చూపించాడు. ఆస్ట్రేలియాను వారి సొంత గ‌డ్డ‌పై 2-1తో తేడాతో ఓడించి భార‌త్‌కు ప్రతిష్టాత్మక  బోర్డర్-గావస్కర్ ట్రోఫీ(2020-21) అందించిన ఘనత అతడిది.

రహానే తన 15 ఏళ్ల కెరీర్‌లో భారత్ తరపున  85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 8414 పరుగులు చేశాడు. అందులో 5077 రన్స్ టెస్ట్ క్రికెట్‌లో సాధించినవే కావడం గమనార్హం. అతడి పేరిట 12 టెస్టు సెంచరీలు ఉన్నాయి.

"ఈ రోజుతో క్యాప్ నంబర్ 278కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. చిన్నతనంలో దొంబివ్లీలో ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రికెట్ కోసం సర్వస్వాన్ని ధారపోశాను. ప్రతీ రోజు, ప్రతీ ఇన్నింగ్స్, బ్యాటింగ్ చేసే అవకాశం లభించినప్పుడల్లా భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలనేది నా ఏకైక కలగా ఉండేది. నా కల పదిహేనేళ్ల కిందట నేరవేరింది. 

తొలిసారి భారత జెర్సీ ధరించినప్పుడు కలిగిన అనుభూతి ఎప్పటికి మర్చిపోలేను. నేను ఈ ఆటను పూర్తి నిబద్ధతతో, నిజాయితీతో ఆడాను. మన ఉద్దేశం సరైనదైతే, ఈ ఆట మనల్ని ఎల్లప్పుడూ గౌరవిస్తుందని నమ్మాను. నేను ఫస్ట్-క్లాస్ క్రికెటర్‌గా అరంగేట్రం చేసినప్పటి నుంచి భారత క్రికెట్ అంచెలంచెలుగా ఎదిగింది.

 గత 20 ఏళ్లలో ఆ ఎదుగుదలలో నేను కూడా ఒక భాగంగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉంది. భారత క్రికెటర్‌గా నా ప్రస్ధానం ముగిసినప్పటికి, నాకిష్టమైన ఈ క్రీడలో మాత్రం కొనసాగుతాను. ఈ అద్భుత ప్రయాణంలో మద్దతుగా నిలిచిన బీసీసీఐ, ఎంసీఎ, నా సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులు అందరికి ధన్యవాదాలు" అంటూ తన రిటైర్మెంట్‌ నోట్‌లో రహానే పేర్కొన్నాడు. కాగా రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పటికి ఐపీఎల్‌లో మాత్రం కొనసాగనున్నాడు.
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)