Breaking News

మార్‌క్ర‌మ్ వ‌ర‌ల్డ్ రికార్డు.. ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రికీ సాధ్యం కాలేదు

Published on Sat, 06/14/2025 - 10:44

రెండో ఐసీసీ ట్రోఫీని ముద్దాడేందుకు సౌతాఫ్రికా అడుగు దూరంలో నిలిచింది. లార్డ్స్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికా విజ‌యం దిశ‌గా దూసుకెళ్తోంది. మ‌రో 69 ప‌రుగులు సాధిస్తే 27 ఏళ్ల మరో ఐసీసీ టైటిల్ స‌ఫారీల ఖాతాలో చేర‌నుంది.

282 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ప్రోటీస్‌.. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి  రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ద‌క్షిణాఫ్రికా ఓపెన‌ర్ ఐడైన్ మార్‌క్ర‌మ్ అద్బుత శత‌కంతో చెల‌రేగాడు. మార్‌క్ర‌మ్ 102 ప‌రుగుల‌తో త‌న బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు కెప్టెన్  టెంబా బావుమా(65 నాటౌట్‌) క్రీజులో ఉన్నాడు.

తొలి ఆట‌గాడిగా..
ఇక ఈ మ్యాచ్‌లో సెంచ‌రీతో మెరిసిన ఐడైన్ మార్‌క్ర‌మ్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్  నాల్గవ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా మార్‌క్ర‌మ్ రికార్డుల‌కెక్కాడు. ఇంత‌కుముందు జ‌రిగిన రెండు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో ఎవ‌రూ ఫీట్ సాధించ‌లేక‌పోయారు.

ఓవ‌రాల్‌గా మార్‌క్ర‌మ్ కంటే ముందు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్లో ట్రావిస్ హెడ్‌, స్టీవ్ స్మిత్ మాత్ర‌మే సెంచ‌రీ సాధించారు. అయితే ఈ రెండు సెంచ‌రీలు కూడా తొలి ఇన్నింగ్స్‌లో వ‌చ్చినవే కావ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా లార్డ్స్ మైదానంలో ఒకే టెస్టులో డ‌కౌట్‌, సెంచ‌రీ నమోదు చేసిన తొమ్మిద‌వ బ్యాట‌ర్‌గా మార్‌క్ర‌మ్ నిలిచాడు.
చదవండి: విజయం దిశగా దక్షిణాఫ్రికా

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు