Breaking News

క్రికెట్‌లో రికార్డులను తిరగరాస్తున్న బాలీవుడ్‌ దర్శకుడి తనయుడు

Published on Tue, 10/22/2024 - 14:51

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు విధు వినోద్‌ చోప్రా తనయుడు అగ్ని చోప్రా దేశవాలీ క్రికెట్‌లో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్నాడు. గతేడాది రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చిన అగ్ని.. తానాడిన మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఈ ఘనత ఎవరూ సాధించలేదు. అగ్ని తాజాగా ఆడిన రంజీ మ్యాచ్‌లో మరో రికార్డు నెలకొల్పాడు. రంజీల్లో మిజోరంకు ప్రాతినిథ్యం వహించే అగ్ని.. అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ, డబుల్‌ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. దేశవాలీ క్రికెట్‌లో ఇలా ఒకే మ్యాచ్‌లో సెంచరీ, డబుల్‌ సెంచరీని ఇంతవరకు ఎవరూ చేయలేదు.

అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులు చేసిన అగ్ని.. రెండో ఇన్నింగ్స్‌లో 238 పరుగులు చేశాడు. అగ్ని సూపర్‌ శతకాలతో చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో మిజోరం 267 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అగ్నికి ప్లేయర్‌ ఆప్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

గత సీజన్‌లోనూ పరుగుల వరద పారించిన అగ్ని
అగ్ని గత రంజీ సీజన్‌లోనూ పరుగుల వరద పారించాడు. అగ్ని ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు సెంచరీలు, మూడు హాఫ్‌ సెంచరీల సాయంతో 939 పరుగులు చేశాడు. అగ్ని సగటు 78.25గా ఉంది. అతని స్ట్రయిక్‌రేట్‌ 103.30గా ఉంది. కాగా, అగ్ని తండ్రి విధు వినోద్‌ చోప్రా గతేడాది "12 ఫెయిల్‌" అనే సూపర్‌ హిట్‌ సినిమాకు దర్శకత్వం వహించాడు. అగ్ని తల్లి అనుపమ చోప్రాకు బాలీవుడ్‌లో మూవీ క్రిటిక్‌గా మంచి పేరు​ంది. 

చదవండి: ఓవ‌ర్ వెయిట్‌..! టీమిండియా ఓపెన‌ర్‌కు ఊహించ‌ని షాక్‌?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)