Breaking News

Kho Kho World Cup: రెండు ప్రపంచకప్‌లు మనవే..

Published on Sun, 01/19/2025 - 21:26

న్యూఢిల్లీ:    భారత ఖోఖో మహిళల జట్టు ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన కాసేపటికే..  భారత పురుషుల జట్టు కూడా అదే ఫలితాన్ని పునరావృతం  చేసింది.  న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో నేపాల్‌తో జరిగిన తుదిపోరులోభారత్‌ 54-36 తేడాతో గెలిచి జగజ్జేతగా నిలిచింది.  ఈ టోర్నీలో ఒక్క  మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌  చేరిన  భారత పురుషుల జట్టు.. అదే  జోరును ఇక్కడ కూడా కొనసాగించింది. ప్రత్యర్థి నేపాల్‌ ను కట్టిపడేసిన భారత్‌.. విశ్వవిజేతగా అవతరించింది. మొట్టమొదటి ఖోఖో వరల్డ్‌కప్‌లో భారత మహిళలు, పురుషుల జట్లు  చాంపియన్స్‌గా నిలవడంవిశేషం. 

ముందుగా జరిగిన మహిళల ఖోఖో వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఖోఖో ప్రపంచకప్‌(Kho Kho World Cup 2025) విజేతగా భారత్‌ మహిళల జట్టు  అవతరించింది.ఈ ప్రపంచకప్‌లో ఆద్యంతం చెలరేగిపోయిన  భారత జట్టు(India).. ఫైనల్లో కూడా సత్తాచాటి విజేతగా నిలిచింది. ఈరోజు(ఆదివారం) జరిగిన ఫైనల్లో భారత జట్టు 78-40 తేడాతో నేపాల్‌(Nepal) జట్టును ఓడించింది. ఫలితంగా తొలి ఖోఖో ప్రపంచకప్‌లో జగజ్జేతగా నిలిచింది.

ఈ ఫైనల్లో  టాస్‌  గెలిచిన నేపాల్‌.. ముందుగా భారత్‌ ను అటాక్‌ రమ్మని ఆహ్వానించింది.  ఇది ఆతిథ్య భారత్‌కు వరంగా మారగా, పర్యాటక జట్టు నేపాల్‌కు  శాపంగా మారింది. ఆది నుంచి రెచ్చిపోయిన  భారత జట్టు.  నేపాల్‌ను వరుస విరామాల్లో తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఎక్కడా కూడా  నేపాల్‌కు అవకాశం ఇవ్వకుండా  భారత్‌ తన ఆధిపత్యాన్నిప్రదర్శించింది.  ​ కడవరకూ ఇదే ఆట   తీరుతో చెలరేగిపోయిన భారత జట్టు.. నేపాల్‌ను మట్టికరిపించి ప్రపంచకప్‌ను  ముద్దాడింది.

ఇరు జట్లకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

ఖోఖో వరల్డ్‌కప్‌-2025లో విశ్వవిజేతలుగా నిలిచిన  భారత మహిళల, పురుషుల జట్లకు  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు,  మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు.  భవిష్యత్‌లో మరిన్ని టోర్నీల్లో  రాణించాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)