Breaking News

జ్యోతి సురేఖకు అపూర్వ స్వాగతం పలికిన శాఫ్‌ ప్రతినిధులు

Published on Wed, 10/11/2023 - 09:50

సాక్షి, విజయవాడ: హాంగ్‌ఝౌ వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్‌ 2023లో ఆంధ్రప్రదేశ్‌ (విజయవాడ) అమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం కాంపౌండ్‌ ఆర్చరీ విభాగంలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే. ఆసియా క్రీడలు ముగిసిన అనంతరం భారత బృందంతో పాటు ప్రధాని మోదీని కలిసిన జ్యోతి సురేఖ.. ఇవాళ సొంత నగరం విజయవాడకు చేరుకుంది. ఈ సందర్భంగా శాప్‌ ప్రతినిధులు, స్థానిక విద్యార్థులు ఆమెకు అపూర్వ స్వాగతం పలికారు.

శాప్‌ ప్రతినిధులు, విద్యార్థులు జ్యోతి సురేఖను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆమె సాక్షి టీవీతో మాట్లాడారు. దేశానికి మూడు స్వర్ణ పతకాలు తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు. ఫ్యామిలీ సపోర్ట్ వల్లే ఇదంతా సాధించగలిగానని తెలిపారు. ఒలంపిక్స్‌లో కాంపౌండ్ ఆర్చరీ లేకపోవడం బ్యాక్ డ్రాప్ అయినా పట్టించుకోనని పేర్కొన్నారు.

భవిష్యత్ గోల్స్ రీచ్ అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తనను  ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చి స్పోర్ట్స్ పాలసీ ప్రకారం తనను అన్ని విధాల సపోర్ట్ చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, జ్యోతి సురేఖ వెన్నం 2023 ఏషియన్‌ గేమ్స్‌ కాంపౌండ్‌ ఆర్చరీలో వ్యక్తిగత, టీమ్‌ ఈవెంట్స్‌లో మూడు స్వర్ణాలు సాధించింది. 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)